Breaking : భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లీగల్ నోటీస్ పంపించారు.. ఎందుకనో మొదటినుంచి ఇండియన్ -2 కు సమస్యలు వెంటాడుతున్నాయి.. రోబో 2 చిత్రం నిర్మించిన ఇదే బ్యానర్ ఇండియన్ 2 విషయంలో బడ్జెట్ ని కంట్రోల్ చేయాలనుకోవడమే సమస్యలు తెచ్చి పెట్టిందని తమిళ సినీ వర్గాల సమాచారం..
తాజాగా శంకర్ ఇతర చిత్రాలకు వెళ్ళకుండా ఆపడానికి లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.. ఇండియన్ 2 సినిమా కి ఇప్పటికే 230 కోట్ల బడ్జెట్ కు 180 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేయలేదని ఆరోపించింది.. ఈ సినిమా పూర్తయ్యేంతవరకు శంకర్ ఇతర చిత్రాలకు వెళ్ళకుండా ఆపడానికి లైకా హైకోర్టును ఆశ్రయించింది.. మిగిలిన వేతనాలను కోర్టులో జమ చేయడానికి లైకా సిద్ధంగా ఉందని.. శంకర్ సమాధానం కోసం నోటీసులు పంపినట్లు సమాచారం..
Breaking: Lyca has moved Madras HC to stop Shankar from moving on to other films, accusing him of not completing #Indian2 after ₹180 out of 230 Cr has already been spent. Lyca Ready to deposit remaining remunerations with the Court. Notices sent to Shankar for his reply!.
— AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) April 1, 2021
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!