Dates With Milk: పాలు సంపూర్ణ ఆహారం, ఖర్జూరం సూపర్ ఫుడ్.. ఈ రెండిటినీ కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు సాధారణ ఫలితాలు కంటే రెట్టింపు ఫలితాలను ఇస్తాయి.. ముఖ్యంగా రాత్రిపూట పాలలో నానబెట్టిన ఖర్జూరం ఉదయం పూట తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలలో కాల్షియం ప్రొటీన్లు విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఖర్జూరంలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అధికంగా ఉండి తక్షణ శక్తిని అందిస్తాయి.. అదే ఖర్జూరాలను రాత్రిపూట పాలలో నానబెట్టి వాటిని ఉదయం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు.. గర్భధారణ స్త్రీలు వీటిని తింటే పిండం వృద్ధి చెందుతుంది. డెలివరీ సమయంలో గర్భాశయం సున్నితత్వాన్ని పెంచడానికి కూడా పనిచేస్తుంది . పాలలో నానబెట్టిన ఖర్జూరం తింటే చర్మంపై వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. బాలింతలకు ఇవి చక్కని ఔషధంగా చెప్పవచ్చు. రక్తహీనతకు ఇది చెక్ పెడుతుంది. ఈ రోజు వీటిని తినడం వల్ల ఆర్థరైటిస్‌లో ఉపశమనం లభిస్తుంది. ఇంకా రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ప్రతి రోజూ వీటిని తింటే ఇక పడకగదిలో హోరాహోరి యుద్ధమే..