Gangavalli Kura: రూపాయి ఖర్చు లేకుండా అనేక రోగాలను నయం చేసే ఈ మొక్క కనిపిస్తే వెంటనే వేర్లతో సహా తెచ్చుకోండి..!!

Share

Gangavalli Kura: నిత్యం మనం ఎన్నో మొక్కలను చూస్తూ ఉంటాం.. కొన్ని మొక్కలలో ఉన్న ఔషధ గుణాలు తెలుసుకుని వాటిని ఉపయోగించుకుంటూ ఉంటాము.. అయితే కొన్ని మొక్కల్లో దాగి ఉన్న ఔషధ గుణాలు తెలియక వాటిని మనం పిచ్చి మొక్కలుగా భావిస్తాం.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మొక్క ఆ కోవలోకే వస్తుంది.. గంగవల్లి కూర మొక్కను చాలా మంది చూసే ఉంటారు.. అయితే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిస్తుందని చాలా మందికి తెలియక పోవచ్చు.. గంగవల్లి కూర లో దాగి ఉన్న ఔషధ గుణాలు.. వాటి ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదులరు.. మీరు కూడా దీని ప్రయోజనాలను పొందుతారు..!!

Excellent Health Benefits of Gangavalli Kura:
Excellent Health Benefits of Gangavalli Kura:

గంగవల్లి కూర లో విటమిన్స్, మినరల్స్ సమృద్ధిగా ఉన్నాయి.. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.. ఈ మొక్క నే పర్సెలెన్ అంటారు. డైట్ నిపుణులు దీనిని సూపర్ బెస్ట్ ఆకుకూర గా సూచిస్తారు. ఎందుకంటే ఈ ఆకు కొరకు విష పదార్థాలను దూరం చేసే శక్తి ఎక్కువగా ఉంది. ఇందులో ఉండే మెగ్నీషియం, కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలు బలంగా ఉండడానికి తోడ్పడతాయి.. అనేక రకాల ఎముకల సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది.. ఏ ఆకు కూరలు లేని ఒమెగా-3 ఆమ్లాలు ఈ ఆకుకూర లో ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యమైన ధమనులు కు సహాయపడుతాయి. గుండె ఆరోగ్యం పదిలంగా ఉండేలా చూసుకుంటుంది. హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అనేక గుండె సంబంధిత వ్యాధులు రాకుండా నివారిస్తుంది. గంగవల్లి కూర కాండం ఆకులలో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఈ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి.. అన్ని కణాలకు ఆక్సిజన్ అందేలా చేస్తాయి.. ఇంకా క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. క్యాన్సర్ రాకుండా చూస్తుంది. ఈ కూరలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. శరీరం అనేక వ్యాధులు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది. ఇది మీ కొల్లాజిన్ రక్తనాళాలు స్థితిలో ఉంచడానికి దోహదపడుతుంది. గాయాలు అయిన చోట ఆకుల రసాన్ని రాసి కట్టుకడితే త్వరగా తగ్గుతాయి.. గాయాలు, పుండ్లు త్వరగా మానిపోయేలా చేస్తుంది.

Excellent Health Benefits of Gangavalli Kura:
Excellent Health Benefits of Gangavalli Kura:

గంగవల్లి కూర లో విటమిన్ ఎ లభిస్తుంది. ఇది ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటి సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది. ఇంకా మీ అవయవాల ఆరోగ్యానికి విటమిన్ ఎ చాలా ముఖ్యమైనది.. ఇది మంచి కణ విభజనకు సహాయపడుతుంది. ఇది ఎర్ర రక్త కణాలను వృద్ధి చెందేలా చేస్తాయి. ఇది కాలేయ, నోటి క్యాన్సర్ రాకుండా చేస్తాయి. ఆకుల్లో ఉండే ఎర్ర కాడలు పేగు సంబంధిత వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. డైయేరియా, కలరా వంటి వ్యాధులు తగ్గిస్తుంది. వీటిలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇందులో కాలరీలు తక్కువగా ఉంటాయి.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. రక్తహీనతతో బాధపడే వారు ఎక్కువగా ఈ ఆకు కూరలు తీసుకోవడం మంచిది. నీ ఆకులోని గ్లూకోజ్, సిట్రిక్, మాలిక్ ఆమ్లాలు ప్రేగు సంబంధిత వ్యాధులను తగ్గిస్తాయి. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. జుట్టు సంరక్షణకు ఇది సహాయపడుతుంది. ఈ ఆకుకూరను రెండు వారాలకు ఒకసారి లేదా నెలలో రెండుసార్లు మాత్రమే తినాలి. ఎందుకంటే దీనికి జలుబు చేసే గుణం ఉంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు ఈ ఆకుకూర ను తినకపోవడమే ఉత్తమం. ఇది చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలను, మృతకణాలను తొలగించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. వీటి ఆకులను పాము కాటు నివారణకు ఉపయోగిస్తారు. గంగవల్లి ఆకు కూర ను పప్పు గాను, పులుసు, ఫ్రై గా చేసుకోవచ్చు. దీనిని ఏవిధంగా తీసుకున్నా కూడా పైన చెప్పుకున్న ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ డైట్ లో గంగవల్లి ఆకు కూర ను యాడ్ చేసుకోండి.


Share

Related posts

వింతలకే వింత ! జనసేన ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్న జగన్ రాజకీయం!

Yandamuri

వైరల్ అవుతున్న గ్యాంగ్ లీడర్ గ్రూప్ ఫోటో..!!

bharani jella

కేసీఆర్ షాక‌య్యేలా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏం చేశారంటే?

sridhar