బిగ్ బాస్ నాలుగో సీజన్ విజయవంతంగా టెలికాస్ట్ అవుతోంది, ప్రస్తుతం ట్రయాంగిల్ లవ్ స్టోరీ పై గురి పెట్టిన నిర్వాహకులు ఎప్పటికప్పుడు గంగవ్వను కవర్ చేస్తూనే ఉన్నారు. అభిమానుల్లో ఆమెకు ఉన్న విశేష ప్రజాదరణను గమనించి గంగవ్వ హైలెట్స్, డైలాగ్స్ ప్రోమో లో పొందుపరుస్తున్నారు. ఇక మిగతా వారి విషయంలో పెద్దగా ఆసక్తి లేకపోయినా వీక్షకులు గంగవ్వ కు మాత్రం ఓట్లతో భారీ స్థాయి తో మద్దతు ఇస్తున్నారు.
‘మై విలేజ్ షో’ తో భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న గంగవ్వ కు ముందు నుంచే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమాయకత్వం, ముక్కుసూటితనం కల్లాకపటం లేని మనసు జనాలను ఎంతో ఆకట్టుకుంది. బిగ్ బాస్ లాంటి హైడ్రామా, ఎమోషన్స్, మోసాలు, కుట్రలు కుతంత్రాలు ఉండే గేమ్ షో లో అవ్వ పై అందరూ జాలి చూపించేవారే. ఇక మొదటి వారమే అందరి కంటే గంగవ్వ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి అంటే ఆమెపై అభిమానం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కానీ ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం గంగవ్వ బిగ్ బాస్ హౌస్ పరిస్థితులకు అలవాటు పడలేకపోతుంది. మొత్తానికి ఆమెకు ధైర్యం చెప్పి పూర్తిగా ప్రిపేర్ చేసి లోనికి పంపించారు. కానీ ఆమె ఏ ఈ క్షణంలోనైనా హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు బిగ్ బాస్ అధికారులు ముందే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. కాబట్టి మనం చూసినట్లయితే అంతకుముందు ఎపిసోడ్ లో కూడా అవ్వ పదే పదే అయిష్టంగానే హౌస్ లో ఉంటున్నట్టు…. నా వల్ల కాదు బిడ్డ నేను పోతాను అని చెప్పడం చూడవచ్చు.
అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ముందు జాగ్రత్తగా రెండవ వారం లోనే దింపేశారు అని టాక్. ఒకవేళ అవ్వ అలాంటి నిర్ణయం తీసుకుంటే…. సంపూర్ణేష్ బాబులా ఆమె అర్ధాంతరంగా బయటకు వెళితే వెంటనే లోపలికి వచ్చేందుకు మరో ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కూడా రెడీగా ఉన్నారు అన్న వార్తలు వస్తున్నాయి. మరి గంగవ్వ అలాంటి నిర్ణయం తీసుకొని తన అభిమానులను బాధ పెడుతుందో లేదా సాధ్యమైనన్ని రోజులు హౌస్ లో ఉండి అలరిస్తుందో వేచి చూడాలి.