Jaggery: బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది.. సహజసిద్ధమైన తీయదనాన్ని కలిగిన బెల్లాన్ని ప్రతిరోజు ఒక ముక్క తింటే బోల్డెన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. నిత్య యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.. నిత్యం యవ్వనంగా ఉండాలంటే ప్రతిరోజు బెల్లాన్ని ఏవిధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తవానికి చక్కెర కంటే బెల్లం ఎంతో మంచిది. బెల్లం నోటిని తీపి ఇవ్వడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది .ఇందులో ఐరన్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే బెల్లం ప్రతి రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లం లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. దీని వలన మన శరీరంలోకి అధికంగా కేలరీలు చేరుతాయన్న చింత, అధిక బరువు పెరుగుతాయన్న భయం ఉండదు.. నిత్యం యవ్వనంగా కనిపించాలంటే ప్రతిరోజు ఓ బెల్లం ముక్కను నోట్లో వేసుకుంటే చాలు.. ముఖంపై ఏర్పడే మచ్చలు, చర్మంపై ముడతలను తొలగించి మంచి నిగారింపును ఇస్తుంది. రోజు బెల్లం తినడం వల్ల వెంట్రుకలు ఊడిపోయి సమస్య నుంచి బయటపడవచ్చు.
ప్రతిరోజు రాత్రిపూట భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క తింటే మనకు చాలా లాభాలు కలుగుతాయి. జీర్ణక్రియను వృద్ధి చెందుతుంది. బెల్లం లో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ను యాక్టివేట్ చేస్తుంది. మలబద్దకం, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలను దూరం చేస్తుంది. పొట్ట చల్లగా ఉండాలంటే బెల్లం షర్బత్ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. శ్వాసకోశ సంబంధ సమస్యలను నయం చేస్తుంది. ఆస్తమాను బెల్లం నువ్వులు కలిపి తింటే చక్కటి ఫలితం ఉంటుంది. టీ, కాఫీ లో చక్కెరకు బదులు బెల్లం వాడితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్స్ సూచిస్తున్నారు.