Pushpa: క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప.. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది.. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా విడుదల చేయనున్నారు మేకర్స్.. తాజాగా సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది..!!
సుకుమార్ దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన సినిమా పాటలు హైలెట్ గా నిలుస్తాయి.. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా లో ఖచ్చితంగా ఒక స్పెషల్ సాంగ్ ఉంటుంది.. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఎంట్రీ ఇవ్వనున్నారని తాజా సమాచారం.. ఇది కనుక వాస్తవమైతే థియేటర్లో రచ్చ రచ్చే.. ఈ సినిమాలో చిరు ఎంట్రీ ఉంటుందని గట్టిగానే టాక్ వినిపిస్తోంది.. ఇంతకుముందు చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో దేవిశ్రీ పాడిన పాటలో బన్నీ కనిపించాడు.. అయితే ఇప్పుడు బన్నీ సినిమా లో చిరంజీవి కనిపిస్తే మరింత గ్రాండియర్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాలో చిరు కనిపిస్తే థియేటర్లో రచ్చ మరల లెవల్లో ఉంటుందనడంలో సందేహం లేదు. ప్రస్తుతం చిరంజీవి గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇవ్వడం లేదు.. స్పెషల్ ఎంట్రీ ఇవ్వమని బన్నీ అడిగితే చిరంజీవి కాదంటారా అనే సందేహాలు కూడా అభిమానుల్లో మొదలయ్యాయి. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!