Sunny Leone: బాలీవుడ్ బ్యూటీ సన్నిలియోన్.. గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ నటిగా మరో మెట్టు ఎక్కడానికి ప్రేక్షకులను ఓ రేంజ్ లో అలరించడానికి సిద్దమవుతోంది.. బాలీవుడ్ సినిమాల్లోనే కాకుండా దక్షిణాది సినిమాల్లో కూడా నటిస్తోంది.. ఇప్పటికే పలు భాషల సినిమాల్లో నటిచింది.. యాక్ట్ చేశామా.. రెమ్మ్యూనిరేషన్ తీసుకున్నామా.. అని కాకుండా దక్షిణాది ప్రేక్షకుల మనుసు గెలుచుకునే పనిలో ఉంది.. అందులో భాగంగా తమిళం నేర్చుకునే పనిలో ఉంది ఈ బ్యూటీ.. తాజాగా మరో సౌత్ సినిమాకు సైన్ చేసింది..
చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో సన్నిలియోన్ రాణి పాత్రలో కనిపించనుంది . ఈ చిత్రానికి యువన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను శక్తి, శశికుమార్ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో సతీష్, సంజన నటిస్తున్నారు. హిస్టారికల్ హారర్ ధ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. ప్రస్తుత కాలానికి, వెయ్యి సంవత్సరాల క్రితం క్లియో పాత్రా జీవించిన కాలానికి మధ్య ఈ సినిమా నుడుస్తుంది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ పార్ట్ లో సన్నిలియోన్ రాణి పాత్రలో కనిపిస్తోందని దర్శకుడు యువన్ తెలిపారు. జూన్ నుంచి ఈ సినిమా సెట్స్ పై వెళ్లనుంది.. ఈ సినిమా కోసం ముంబై, చెన్నై లో ప్రత్యేక సెట్టింగ్స్ ఏర్పాటు చేసి.. అందులో షూటింగ్ చేయనున్నట్లు తాజా సమాచారం..
ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి విషియాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.. ప్రస్తుతం సన్నిలియోన్ తమిళం లో వీరమాదేవి సినిమాలో నటిస్తున్నారు.. అంతేకాకుండా తమిళం లో మరో సినిమా కూడా చేయనుంది. ఈ రెండు సినిమాల కోసం సన్నీ తమిళం నేర్చుకుంటుందని దర్శకుడు తెలిపారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!