Today Gold Rate: పసిడి ప్రియులకు ఊరట.. ఈరోజు బంగారం, వెండి ధరలు..

gold-photo
Share

Today Gold Rate: (27/4/2021) బంగారం కొనడానికి భావిస్తున్న వారికి ఇది శుభ తరుణంగా చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పుత్తడి ధరలకు గత రెండు రోజులుగా బ్రేక్ పడింది. దీంతో ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్న రేట్లు వరుసగా పడిపోయాయి. సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు మంగళవారం ఉదయం ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.. బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

Today Gold Rate: constant silver price decreases
Today Gold Rate: constant silver price decreases

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,590 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,650 నిన్నటి రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. విజయవాడ, వైజాగ్, మంగళూరు, మైసూర్ , భువనేశ్వర్, కేరళ, బెంగళూరు మార్కెట్ లో కూడా బంగారం ధరలు ఇలానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర నిన్నటి ధరకి రూ.200 తగ్గింది. దీంతో ఈరోజు వెండి ధర రూ.73,800 కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల లోని బంగారం ధరలలో మార్పు, స్టాక్ మార్కెట్స్ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.


Share

Related posts

కరోనా మరణాల సంఖ్యను కేరళ ప్రభుత్వం దాచిపెట్టిందా? సంక్షోభం వేళ సరికొత్త వివాదం!

Yandamuri

Eatela Rajendar: ఈట‌ల బ‌ల‌హీనుడు, వ్య‌క్తిత్వం లేని మ‌నిషి… ఎవ‌రు అంటున్నారంటే…

sridhar

Hansika Beautiful Pictures

Gallery Desk