NewsOrbit
న్యూస్

కరోనా పరీక్షల్లో ఏపీ రికార్డు..!

కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యధిక పరీక్షలు చేస్తూ రికార్డు సృష్టించింది. రోజుకి 36,047 పరీక్షలు చేసే సామర్థ్యాన్ని ఇప్పటికే సాధించి రికార్డు నెలకొల్పింది. రాష్ట్రంలో కోవిడ్ 19 పరీక్షల మొత్తం సంఖ్య 10 లక్షలకు చేరింది.

ఈ సందర్బంగా ఏపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో కరోనా పరీక్షల గ్రాఫ్ ను పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ కరోనా వ్యాప్తిని నియంత్రించే స్థాయికి తీసుకు రావడం జరిగిందని అయన అన్నారు. ‘త్వరలోనే కరోనాను జయిస్తాం .. అందరూ ఇళ్లలోనే, సురక్షితంగా ఉండాలి’ అని మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలు అయినప్పటి  నుండి అత్యధికంగా కోవిడ్ 19 పరీక్షలు చేస్తోన్న విషయం తెలిసిందే.

మరో పక్క కరోనా వ్యాప్తి ఏపిలో రికార్డ్ స్థాయిలో కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 16,712 మందికి కోవిడ్ 19 పరీక్షలు జరుపగా 1322 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 18,697గా ఉన్నది.
కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కృష్ణ, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 239 చేరింది. కాగా 8920 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 10,860 మంది చికిత్స పొందుతున్నారు.

మంత్రి మేకపాటి కోవిడ్ 19 పరీక్షల గ్రాఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్ ల నుండి అనూహ్య స్పందన కనిపించింది. ఈ సందర్బంగా ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని ప్రశంసిస్తున్నారు.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?