NewsOrbit
Featured బిగ్ స్టోరీ

కరోనా కాలంలో విజేత జగనే…!

మోడీ లాగా వీడియో సందేశాలు లేవు…!
కెసిఆర్ లాగా ప్రెస్ మీట్లు లేవు…!
చంద్రబాబు లాగా జూమ్ సందేశాలు లేవు…!
ఏ హడావిడి, హంగామా లేదు. కానీ పని జరిగింది, ఎంతో కొంత ఫలితం కనిపిస్తుంది. అందుకే జగన్ విజేతగా నిలుస్తున్నారు…!!

పారాసెటమోల్ వేసుకుంటే చాలు అంటే నవ్వారు..! బ్లీచింగ్ పౌడర్ చల్లితే చాలు అంటే కామెడీ చేశారు..! సహజీవనం చేయాల్సి వస్తుంది ఏమో అంటే, సోషల్ మీడియాలో ఆడుకున్నారు..! ఇప్పుడు కరోనా కాలం కొనసాగుతున్న కొద్దీ జగన్ చెప్పిన ప్రతి మాట గుర్తుకొస్తుంది. అవును నిజమే అనిపిస్తుంది. నాడు ట్రోల్ చేసిన చేతులు నేడు గుర్తుచేస్తున్నాయి. ఓవైపు కరోనాని తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తూనే… దాని పట్ల సీరియస్ గా వ్యవహరించారు సీఎం జగన్. అందుకే కరోనా కాలంలో విజేత ఆయనే. కరోనాపై గెలవలేకపోయినా.., దేశంలోని కొందరు మంచి ముఖ్యమంత్రుల్లో మాత్రం ఈయన నిలిచిపోతారు.

మొదటి నుంచి కరోనా పరీక్షలు విషయంలో.., మాస్క్ ల విషయంలో, లాక్ డౌన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకొని పక్కాగా అమలు చేస్తున్నారు. తాజాగా కూడా తనకు ఎంతో ఇష్టమైన, తాను కలలు గన్న కార్యక్రమం “ఇళ్ల పట్టాల పంపిణీ”ని మళ్లీ మూడోసారి వాయిదా వేశారు. కరోనా ఎదుర్కోవడంలో పెద్దగా హడావుడి చేయనప్పటికీ, కరోనాపై యుద్ధంలో ఇతర రాజకీయ నాయకులతో పోల్చిన.., పక్క రాష్ట్రాల సీఎం లతో పోల్చినా జగనే విజేతగా ఉంటారు. అందుకు కారణాలు ఏంటో కాస్త లోతుగా పరిశీలిద్దాం పదండి.

రిస్క్ ఎందుకులే అని ఇష్టమైన వదిలేశారు…!

* ఇళ్ల పట్టాల పంపిణి నిజానికి ఉగాది మార్చి 25 జరగాల్సిందే కానీ వాయిదా వేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా జరగాల్సి ఉంది ఆగస్టు 15కు వాయిదా వేశారు. నిజానికి 30 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా… ప్రభుత్వం అనుకుంటే కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రాంరంభించేయవచు. ఓ వందమందిని కాస్త దూరంగా కూర్చోబెట్టి ఇటువంటి ప్రాజెక్టుని పథకాన్ని అమలు చేశారు. తెలంగాణలో కేసీఆర్ గండి పోచమ్మ ప్రాజెక్టు ప్రారంభించినట్టుగా, హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్టుగా ఇక్కడ కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేయవచ్చు. కానీ పేరు కోసం, ప్రతిష్టాత్మక పథకం కోసం అనవసరమైన దృష్టికి తీసుకుని ఉద్దేశం లేకుండా కరోనా బారిన పడకుండా జగన్ తన కలల ప్రాజెక్ట్ ని మరో నెల రోజుల పాటు వాయిదా వేసుకున్నారు. అంటే కరోనాని ఎదుర్కోవడంలో సీఎంగా ఎంతో బాధ్యతాయుతంగా, ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ.

పరీక్షలపై ప్రణాళికగా…!

పది లక్షల మందికి పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది దేశంలో ఇంత సంఖ్యలో కరోనా పరీక్షలు చేసిన రాష్ట్రాలు మూడే. మనకంటే ముందు మహారాష్ట్ర, తమిళనాడు ఉండగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ మార్క్ చేరుకుంది. తెలంగాణతో పోలిస్తే ఇది పది రెట్లు అధికం. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.., టెస్టుల సంఖ్య అంతకన్నా ఎన్నో రేట్లు ఎక్కువ ఉంది, పాజిటివిటి రేటు తక్కువ ఉంది కాబట్టి పెద్ద ఆందోళనకరం కాదు. కరోనా పరీక్షల విషయంలో చూసుకుంటే ఏప్రిల్ 15 నాటికి రాష్ట్రంలోనూ.., దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. అప్పటికే మన రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయాలంటే నమూనా తీసుకువెళ్లి హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కు ఇవ్వాల్సి వచ్చేది అక్కడి నుంచి మూడు లేదా నాలుగు రోజులకు ఫలితాలు వచ్చాయి. ఇలా జాప్యం రావడంతో జగనే సొంతంగా విదేశాల నుంచి రాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పించారు. నాటి నుంచి రోజుకు ఐదు వేల, ఆరు వేల పరీక్షలు చేస్తూ వేగం పెంచారు. పరీక్షల్లో వేగం పెంచుతున్న కొద్ది అప్పటివరకు రోజుకు 30 ,40 కేసు నమోదు ఆ తర్వాత రోజు 100 దాటి నమోదయ్యాయి . ఇక ఇవి కూడా పెరుగుతుండటంతో జూన్ 10వ తేదీ తర్వాత నుంచి పరీక్షల సంఖ్యను మరింత పెంచారు. రోజుకి ఇరవై ఐదు వేలకు పైగా శాంపిళ్లను సేకరించి ల్యాబ్ కు తరలించారు. దీనికోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో 17 ల్యాబ్లు ఏర్పాటు చేశారు . ఫలితాలు ఒక్క రోజు వ్యవధిలో వచ్చేలా చర్యలు తీసుకున్నారు . ఇలా రోజుకి సగటున 30 నుంచి 35 వేల మధ్య ఫలితాలు తీసుకుంటూ వాటిని అదుపు చేస్తూ కరోనా పరీక్షల విషయంలో సమర్ధవంతంగా పని చేశారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ దానికి తగ్గట్టు పరీక్షలు సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంది.

వాలంటీర్ల వ్యవస్థ బాగా ఉపయోగపడింది…!

కరోనా కట్టడిలో , కరోనా పరీక్షలు నిర్వహించడంలో, ఆ లక్షణాలు ఉన్న వారిని కనిపెట్టడంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో వాలంటీర్లు బాగా పని చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్నస్థాయి పట్టణాల్లోనూ వాలంటీర్లు ఆ లక్షణాలు ఉన్న వారిని 60 ఏళ్లు పైబడిన వారిని గుర్తించి ఎప్పటికపుడు ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో ఇచ్చే వాళ్ళు . దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫార్మా రూపొందించి వాలంటీర్లకు అందించారు. ద్వారా రోజువారీ తమకు కేటాయించిన యాభై ఇళ్లలో ఎవరైనా కొత్త వాళ్లు వచ్చారా ఇంటి నుంచి ఎవరైనా బయటికి వెళ్లారా. ఎవరైనా దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా ? ప్రాథమిక సమాచారాన్ని ఆరా తీస్తూ రోజు రోజు సాయంత్రం 5:00 కల్లా ఉన్నతాధికారులకు నివేదిక చేరేది. ఈ నివేదికను మదింపు చేసుకుని ఆ తర్వాత రోజున ఆరోగ్య శాఖ సిబ్బంది బాధితుల ఇళ్లకు చేరుకొని పరీక్షలు నిర్వహించే వాళ్ళు. ఇలా కరోనా నియంత్రణలో గ్రామ స్థాయి పట్టణ స్థాయిలో వాలంటీర్లు సీఎం ప్రణాళిక ద్వారా పని చేయడం ద్వారా కొంతమేరకు ఫలితాలు రాబట్టారు ఇతర రాష్ట్రాలకు లేని బలం వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ కు ఉండడం బాగా కలిసి వచ్చింది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju