NewsOrbit
న్యూస్ హెల్త్

కోవిడ్ టెస్టుల వెనుక అసలు నిజాలు..!

వాటిని తెలుసుకోవాలి అంటే ముందుగా “యాంటిజెన్”, “యాంటీబాడీ”ల గురించి తెలుసుకోవాల్సిందే.

టెర్రరిస్టులు మన దేశంలోకి ప్రవేశించినపుడు ఆర్మీ, పోలీసులు వాళ్ళని చంపడానికి ఎలా ప్రయత్నిస్తారో, వైరస్ లు మన శరీరంలోకి ప్రవేశించినపుడు మన శరీరంలో కూడా వాటిని చంపడానికి రక్షక వ్యవస్థ (ఇమ్మునో గ్లోబులిన్స్) ఉంటుంది.

 


Coronavirus testing methods: What you need to know | News | Al Jazeera 

ఇక్కడ టెర్రరిస్టులు/వైరస్ ని “యాంటీజెన్” అనుకుంటే పోలీసులు/ఇమ్మూనో గ్లోబ్యులిన్స్ ని యాంటీబాడీస్ అనుకోవాలి. ఇక్కడ రెండు పక్షాల మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు అన్న దాని మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

ఇక టెస్టుల విషయానికి వస్తేకరోనాని నిర్ధారించడానికి ప్రస్తుతం మన దగ్గర 3 రకాల పరీక్షలు చేస్తున్నారు.

1.RT-PCR : దీని ద్వారా మన శరీరంలో వైరస్ RNA జీనోమ్ (యాంటీజెన్) కనిపెడతారు. ఇది అత్యంత నమ్మదగిన, ఖచ్చితమైన పరీక్ష. ఇది ఒక్క వైరస్ అణువును కూడా తొలి దశలోనే గుర్తించ గలదు.

2. TrueNat/CBNAAT : ఇవి కూడా వైరల్ జీన్స్ ని కని పెట్టడానికి వాడతారు. కాకుంటే ఇది పరిమాణ పరీక్షలు మాత్రమే. ధర కూడా తక్కువ. తీసుకున్న నమూనా సరిగ్గా లేకుంటే ఇవి వైరస్ ను గుర్తించలేవు. RTPCR కంటే ఫలితాలు వేగంగా ఇవ్వగలిగినా ఖచ్చితత్వం ఉండదు.

అయితే…శాంపిల్ సేకరణ లో ఖచ్చితత్వం, ఈ పరీక్షలకు వాడే కిట్స్ యొక్క సున్నితత్వం, సిబ్బంది శిక్షణా సామర్ధ్యం వంటి అంశాల మీద ఈ పరీక్షల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఇప్పుడు మనం చూస్తున్న ఫలితాలు కొంచెం సందేహం కలిగిస్తున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం 11 చోట్ల RTPCR, 47 చోట్ల TrueNat పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తూ ఉండగా, తెలంగాణలో ప్రభుత్వం కేవలం 10 చోట్ల మాత్రమే RTPCR, నాలుగు చోట్ల CBNAAT పరీక్షా కేంద్రాలు నిర్వహిస్తూ ఉంది. తెలంగాణలో తక్కువ పరీక్షలకు ఇదొక కారణం.

ఇక రాపిడ్ టెస్టింగ్ కిట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇవి “యాంటీ బాడీస్” ని కనిపెట్టి రోగ నిర్ధారణకు ఉపయోగపడతాయి. ఖచ్చితత్వం చాలా తక్కువ. వైరస్ మన బాడీలో ప్రవేశించాక 5 రోజులకు కానీ యాంటీ బాడీస్ తయారు అవవు. అందుకే ఇవి అంత ఉపయోగకరం కాదు.

(పైన ఇచ్చిన సమాచారం మొత్తం డా. ఏవీఎస్ రెడ్డి  ఎంబీబిఎస్ డాక్టర్, క్యాన్సర్ స్పెషలిస్ట్, ట్విట్టర్ అకౌంట్ నుండి సేకరించి పొందుపరచినది.)

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju