ఒక నెల రోజుల క్రితం భారతదేశ సినీ ఇండస్ట్రీని విస్మయానికి గురి చేసిన బాలీవుడ్ స్టార్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు సుశాంత్ తను చనిపోయే ముందు నటించిన ఆఖరి చిత్రం ‘దిల్ బేచారా‘ డిస్నీ హాట్ స్టార్ ఓటిటి ప్లాట్ఫామ్ లో ద్వారా ఉచితంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం….
కథ
కథను మనం చూసినట్లయితే ‘మణిరత్నం‘ గీతాంజలి సినిమా ఈ కాలంలో వస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్లు అనిపిస్తుంది. థైరాయిడ్ క్యాన్సర్ తో బాధపడుతూ బాగా బోరింగ్ లైఫ్ గడుపుతున్న అమ్మాయి కిజి బసు (సంజన సంఘి). తన బోరింగ్ లైఫ్ లోకి చాలా చలాకీ గా ఉంటూ తనకు నచ్చిన పని చేసే ఇమాన్యుల్ రాజ్ కుమార్ జూనియర్ అలియాస్ మానీ (సుశాంత్ సింగ్ రాజ్ పుత్) ప్రవేశిస్తాడు. మానీ కి ఎప్పటికైనా సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా హీరో అవ్వాలని కోరిక. అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి ఒక సినిమా ప్లాన్ చేసుకుంటాడు అందులో హీరోయిన్ గా కిజి బసు ని సెలెక్ట్ చేసి నటించేందుకు ఒప్పిస్తాడు. ఈ సినిమా ప్రయాణంలో వీరిద్దరూ ప్రేమలో పడగా హీరోయిన్ కు ఉన్న ఒకే ఒక కోరిక తనకు బాగా ఇష్టమైన పాట రాసిన అభిమన్యు వీర్ (సైఫ్ అలీ ఖాన్) కలవాలి అనుకోవడం. దాని కోసం మానీ ఏం చేశాడు? అసలు మానీ గురించి చివరికి తెలిసే షాకింగ్ నిజం ఏమిటి..? వీరిలో ఎవరు చనిపోయారు? ఎవరు ప్రాణాలతో ఉంటారు అన్నది సస్పెన్స్.
పర్ఫామెన్స్
కేవలం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కోసం ఈ సినిమా చూశారు అన్నది వాస్తవం. చూసినంత సేపు అతను మనందరి నవ్విస్తాడు, మనతోపాటు ఎంజాయ్ చేస్తాడు చివరికి ఎమోషన్ తో ఏడిపించేస్తాడు. ఈ సినిమాతో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటన కి బాగా కనెక్ట్ అవుతాము. మన ఇంట్లో ఉండే చిన్న పిల్లోడు అలా తెర మీదకు వచ్చి నటించి పోయినట్లు ఫీలవుతాం. ఎంత ఎంజాయ్ చేస్తామో…. అంతే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాము. సుశాంత్ తమ చివరి సినిమాలోనే కెరీర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ తో వెండితెరకు వీడ్కోలు చెప్పాడని అనుకోవచ్చు. హీరోయిన్ సంజన కూడా తన పాత్రలో చక్కగా నటించింది. సైఫ్ అలీ ఖాన్ సినిమాలో కనిపించేది ఒక సన్నివేశం అయినా చాలా బాగా రూపొందించారు.
పాజిటివ్స్
సుశాంత్ మర్చిపోలేని నటన
ఎమోషనల్సీన్స్
మొదటి 30 నిమిషాలుచివరిపదిహేనునిమిషాలు
రెహమాన్నేపధ్యసంగీతం
విజువల్స్ అండ్ డిజైనింగ్
నెగిటివ్
సినిమాచాలాస్లోగాఅనిపిస్తుంది
అంతసేపు సాగదీసి ఒక్కసారిగా క్లైమాక్స్ కి జంప్ చేసినట్లు ఉంటుంది
మొత్తానికి
ఈ సినిమాను హాలీవుడ్ హిట్ సినిమా స్ఫూర్తితో రూపొందించినా అది మన తెలుగు సినిమా గీతాంజలి కథని పోలి ఉంటుంది. అంతేకాకుండా సినిమా ఓపెనింగ్ సీన్ లో హీరోయిన్ మాటల్లోనే మనకి కథ అర్థం అయిపోతుంది. ఇటువంటి కథలకు ఎమోషనల్ డ్రైవ్ చాలా అవసరం. సినిమా ఎక్కడా పెద్దగా ఎగ్జైట్ చేయదు. సుశాంత్ నటనకు, ప్రీ క్లైమాక్స్ పోర్షన్ కు అందరూ ఎమోషనల్ అయిపోతారు కానీ ఇంకా మంచి కథనం ఉంటే బాగుండేది అనిపించింది.
కానీ దర్శకుడిగా పరిచయం అయినా ముఖేష్ చబ్రా ఒక మంచి ఎమోషనల్ సినిమా తీశాడు అన్న భావన చివరిలో కలుగుతుంది. యాదృచ్ఛికమో ఏమో తెలియదు కానీ.. సుశాంత్ ఎందుకు వదిలి వెళ్లిపోయావ్ అనే బాధ తెలియయకుండానే మనకి కలిగి చివరి సీన్ లో చెమర్చిన కళ్ళతో సినిమాని ముగిస్తాం. చివరిగా సుశాంత్ కి ఓ అద్భుతమైన నివాళి మరియు చూసిన వారికి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అనుభవం ఈ ‘దిల్ బేచారా’.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!