NewsOrbit
రివ్యూలు సినిమా

మూవీ రివ్యూ : ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ – ఒక ప్రశాంతమైన ప్రతీకారేచ్చ

కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అంటూ మలయాళం యొక్క రీమేక్ తో తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించాడు. మలయాళంలో మంచి విజయం సాధించిన మహేషింటే ప్రతీకారం అనే చిత్రానికి ఇది రీమేక్. ఈ మధ్య కాలంలో చాలా మంచి పాత్రలు చేస్తూ బాగా ప్రతిభ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ హీరోగా నరేష్, సుహాస్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా నేరుగా ఓటిటి లో రిలీజ్ అయింది. నెట్ ఫ్లిక్స్ లో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి చూద్దాం…

 

Uma Maheswara Ugra Roopasya | Venkatesh Maha | Arka Media

కథ

అరకు లో ఉండే మహేష్ (సత్యదేవ్) ఒక సాధారణ ఫోటోగ్రాఫర్. చిన్న స్టూడియో నడుపుకుంటూ ఏదో తనకు వచ్చిన ఫోటోగ్రఫీ తో ఇంట్లో జబ్బుపడిన ఉన్నా నాన్న (కెవి ప్రభాకర్) ని చూసుకుంటూ ప్రకృతి అందాల మధ్య ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. నాటు వైద్యం చేసే బాబ్జి (నరేష్) అతడికి అండగా ఉంటాడు. ఇక బాబ్జి దగ్గర సుహాస్ పనిచేస్తుంటాడు. ఇలా జీవితంలో ఎటువంటి ఆర్భాటాలు, చీకూచింతా లేకుండా బ్రతుకుతున్న మహేష్ ను అనుకోని సందర్భంలో పక్క ఊరి నుంచి వచ్చిన ఒక రౌడీ కొడతాడు. సెంటర్లో అందరిముందు తనకు అవమానం జరగడంతో తిరిగి ఆ రౌడీ ని కొట్టే వరకూ తాను చెప్పులు వేసుకోనని మహేష్ శపథం చేస్తాడు. వాడిని ఎలాగైనా తిరిగి కొట్టాలని వెళ్తే ఆ రౌడీ కాస్తా దుబాయ్ వెళ్లి పోతాడు. వాడు ఎప్పుడు వస్తాడా…. తను ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుందామా అని ఎదురు చూస్తున్న మహేష్ ఈ క్రమంలో జ్యోతి (రూప కొడవయూర్) తో ప్రేమలో పడతాడు. ఇంతకీ దుబాయ్ వెళ్లిన వాడు తిరిగి వచ్చాడా…. అసలు మహేష్ లవ్ స్టోరీ ఏమైంది..? అతని జీవితాన్ని వాళ్ళ నాన్న ఎలా మలుపు తిప్పుతాడు అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

Uma Maheswara Ugra Roopasya' and other Telugu films to look ...

విశ్లేషణ

ఒరిజినల్ సినిమా కు తగ్గట్టు ఇందులో కూడా ప్రకృతి అందాలను బ్యాక్ డ్రాప్ లో గా చూపించి ప్రేక్షకుడికి ప్రశాంతమైన వాతావరణాన్ని అలవాటు చేయడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు మహా. సినిమా సాగుతున్నంత సేపు మహేష్ తో పాటు మనం ప్రయాణిస్తాం. అంత అద్భుతంగా చేశాడు సత్యదేవ్. ఇక ఎంతో వైవిధ్యభరితంగా మరియు సహజంగా ఉండే ఈ కథను వెంకటేష్ దర్శకుడు చేతిలో పడటం నిజంగా తెలుగు ప్రేక్షకుల అదృష్టం. అయితే మలయాళంలో కనపడినంత సహజత్వం ఇక్కడ కనబడకపోవడంతో ఫీల్ కొద్ది చోట్ల మిస్ అయింది. ఇక సినిమా కూడా స్లోగా సాగుతున్నట్లు అక్కడక్కడా అనిపిస్తుంది. అంతే తప్పించి వెంకటేష్ మహా టేకింగ్ లో ఎలాంటి తప్పులు కనబడవు. నటుడిగా సత్యదేవ్ ఇరగదీశాడు అనే చెప్పాలి. రోజుకు ఒక కొత్త రూపంలో నటుడిగా  తనని తాను ఆవిష్కరించుకుంటూ ఉన్నాడు. సత్యదేవ్ కు నరేష్ మరియు సుహాస్ ఈ కథను నడిపించడంలో చాలా బాగా సహకరించారు. ఒరిజినల్ సినిమాకు సంగీతం అందించిన జాతీయ అవార్డు గ్రహీత బిజ్బల్ ఈ చిత్రానికి కూడా అవే బాణీలు మరియు నేపథ్య సంగీతం ఇచ్చాడు. రవితేజ గిరిజాల ఎడిటింగ్ పర్వాలేదనిపించగా…. అప్పు ప్రభాకర్ తన సినిమాటోగ్రఫీ అరకు అందాలను బాగా చూపించాడు.

Venkatesh Maha's next 'Uma Maheshwara Ugra Roopasya' is a remake ...

పాజిటివ్ లు

సత్యదేవ్ నటన

సహజమైన కథా నేపథ్యం

ఛాయాగ్రహణం

సంగీతం

రెండవ హీరోయిన్

నెగిటివ్ లు

కాస్త ఎక్కువగా ఉండే నిడివి

అక్కడక్కడా బోర్ కొట్టించే స్క్రీన్ ప్లే

ఎమోషనల్ గా సరిగ్గా కనెక్ట్ కాలేకపోవడం

Uma Maheswara Ugra Roopasya Telugu Movie Review | 123telugu.com

చూడొచ్చా…?

ఓటిటి లో విడుదలైన ఈచిత్రం డిజిటల్ రిలీజ్ కోసమే షూటింగ్ జరుపుకోవడంతో ఆ కోణంలో మంచిచెడులను విశ్లేషించాల్సి అవసరం ఎంతైనా ఉంది. మొత్తానికి ఈ చిత్రం చాలా బాగా ప్రశాంతగా నడుస్తుంది. రీమేక్ అయినప్పటికీ దర్శకుడు తన సొంత పనితనం చూపించాడు. అయితే తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్ కు తగ్గట్లు సహజత్వంతో పాటు ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా ఇక్కడ పెట్టి ఉంటే ఎమోషన్ ఇంకా పూర్తిస్థాయిలో పండి ఉందేది అనిపిస్తుంది. సత్య దేవ్ లాంటి మంచి నటుడిని పెట్టుకున్నప్పుడు ఈ కథలో మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కొన్ని ఎమోషనల్ పాయింట్స్ జతపరచి ఉండవచ్చు. అయితే ఇందులో ఉండే కామెడీ ఎలిమెంట్స్ మాత్రం ఒరిజినల్ లో లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అని చెప్పాలి. అక్కడక్కడ సహజత్వం లోపించినట్లు అనిపించినా మొత్తానికి ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ వ్యూయర్స్ కు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది. చిన్న చిన్న తప్పులని మినహాయిస్తే ఈ చిత్రాన్ని చూడకుండా ఉండేందుకు పెద్దగా కారణాలు ఉండవు. హాయిగా రెండున్నర గంట ప్రశాంతంగా చూసి అలా స్క్రీన్ కట్టేసి కట్టేయొచ్చు.

న్యూస్ ఆర్బిట్ రేటింగ్ : 3.25/5

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri