సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు తన 46 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో ప్రేక్షకులను అలరించిన మహేష్ ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా లో నటించనున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-లుక్ లో మహేష్ మాస్ అవతార్ పై ఒక హింట్ ఇచ్చారు. అయితే తాజాగా అతని పుట్టినరోజునాడు ఎస్.ఎస్.తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చిన ఒక మ్యూజిక్ ట్రాక్ ను మోషన్ పోస్టర్ ద్వారా విడుదల చేశారు. అయితే ఇందులో మహేష్ ముఖం పూర్తిగా కనిపించలేదు. ఇక ఈ రోజు విడుదల చేసిన మోషన్ పోస్టర్ లో ఒక రూపాయి బిళ్ళ ను మహేష్ బాబు ఎగరేస్తున్నట్లు అతని చేతిని మాత్రమే చూపించారు కానీ ఇప్పుడు కూడా బాబు ముఖాన్ని అసలు చూపించుకోవడం సూపర్ స్టార్ అభిమానులను నిరాశ పరిచింది అనే చెప్పాలి.
అయితే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, టైటిల్ కార్డు తో ఫ్యాన్స్ బాగానే సంతృప్తి చెందుతారు కానీ మహేష్ ను ఆ మాస్ అవతార్ లో ఒకసారి చూసుకుందాం అన్న సంతోషం మాత్రం ప్రేక్షకులకు మిగల్లేదు.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలా షూటింగ్ అయిపోవాల్సి ఉండగా… ఏదీ మొదలు కాకపోవడంతో మహేష్ తో పెద్దగా షూటింగ్ కూడా జరుపకవడం దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. అరకొర స్టిల్స్ వదిలి ప్రేక్షకులను నిరుత్సాహపరిచే కన్నా ఇలా తమ బెస్ట్ ఇచ్చేందుకు టీం కృషి చేసిందని కొంతమంది మహేష్ బాబు అభిమానులు అనుకుంటున్నారు.