NewsOrbit
న్యూస్

రూ.కోట్లు పెట్టి కొన్న ఫ్రెండ్ కారును.. గోడ‌కు గుద్దేశాడు.. వైర‌ల్ వీడియో..!

సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే చాలా ఖ‌రీదైన వ‌స్తువుల‌ను స్నేహితుల‌కు కాదు క‌దా.. ఇంట్లోని ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు కూడా అంత సుల‌భంగా వాడుకునేందుకు ఇవ్వ‌రు. కానీ కొంద‌రు మాత్రం ఈ విష‌యంలో అప‌ర దాన‌క‌ర్ణులలా ఉంటారు. ఎవ‌రైనా ఏదైనా అడిగితే కాద‌నుకుండా ఇచ్చేస్తారు. అలా ఓ వ్య‌క్తి తాను రూ.కోట్లు పెట్టి కొన్న కారును స్నేహితుడు అడిగాడ‌ని ఇచ్చాడు. కానీ ఆ స్నేహితుడు మాత్రం ఆ కారును కంట్రోల్ చేయ‌డం చేత‌కాక దాన్ని గోడ‌కు గుద్దేశాడు. ఈ క్ర‌మంలో తీసిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

man borrowed lamborgini car from friend and smashed it into wall

స్పెయిన్‌లోని హుయెల్వా అనే ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి 2.15 ల‌క్ష‌ల పౌండ్లు (దాదాపుగా రూ.2.10 కోట్లు) పెట్టి లంబోర్గిని కంపెనీకి చెందిన హురాకాన్ పెర్ఫామెంటె అనే గ్రీన్ క‌ల‌ర్ కారును కొన్నాడు. దాన్ని అత‌ని స్నేహితుడు అడిగాడు క‌దా అని ఇచ్చాడు. అయితే ఆ స్నేహితుడు దాన్ని కంట్రోల్ చేయ‌లేక‌పోయాడు. అదే ప్రాంతంలో ఓ చోట కారు ఓవ‌ర్ స్పీడ్ అయి కంట్రోల్ త‌ప్పింది. దీంతో కారును ఓ నిర్మాణం వ‌ద్ద ఉన్న గోడ‌కు గుద్దేశాడు. త‌రువాత అక్క‌డి నుంచి అత‌ను ప‌రార‌య్యాడు.

https://youtu.be/cmkEqJVmHPU

ఇక పోలీసులు అక్క‌డికి చేరుకుని ఆ కారును గోడ నుంచి బ‌య‌ట‌కు తీసేందుకు నానా క‌ష్టాలు ప‌డ్డారు. అందుకు గాను వారు అక్క‌డ కొన్ని గంట‌ల పాటు విద్యుత్‌ను కూడా నిలిపివేశారు. దీంతో స్థానికులు తీవ్ర అస‌హ‌నానికి లోన‌య్యారు. చాలా సేపు శ్ర‌మించాక కారును పోలీసులు ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌కు తీశారు. అయితే దాన్ని యాక్సిడెంట్ చేసిన వ్య‌క్తి హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటుండ‌గా వారు అత‌న్ని అరెస్టు చేశారు. ఆ స‌మ‌యంలో అత‌ను పోలీసుల‌కు అది త‌న స్నేహుతుడి కార‌ని, తాను దాన్ని అత‌ని నుంచి అడిగే తీసుకున్నాన‌ని తెలిపాడు. అయిన‌ప్ప‌టికీ పోలీసులు అత‌నిపై నిర్ల‌క్ష్యంగా కారును అతి వేగంగా న‌డిపినందుకు కేసు న‌మోదు చేశారు. కాగా కారు ముందు భాగం మొత్తం పూర్తిగా ధ్వంస‌మైంది. కారును వెలికి తీస్తుండ‌గా.. షూట్ చేసిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక ఆ కారు కేవ‌లం 2.9 సెక‌న్ల‌లోనే గంట‌కు సుమారుగా 100 కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకోగ‌ల‌దు. అందుక‌నే దాన్ని అత‌ను కంట్రోల్ చేయ‌లేక‌పోయాడ‌ని తెలుస్తోంది..!

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!