NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

మోడీ గడ్డం వెనక .. మోడీ మనసు వెనక కథ !

ఈ లాక్ డౌన్ లో అంతా తమ వారి కన్నా పక్క వారి గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెట్టేశారు. ఇక మనల్ని ద్వేషించే వాళ్లు అయితే ఎప్పటికప్పుడు మన యోగక్షేమాలు చూస్తూ మనలో వచ్చే మార్పులను గమనిస్తూ ఉంటారు.. అంచనా వేస్తారు…. విశ్లేషించుకుంటూ ఉంటారు. మనం బాగుంటే ఏడుస్తారు లేదంటే నవ్వుతారు. కుదిరితే కవ్వింపులు, వెక్కిరింతలు కూడానూ. ఇప్పుడు నరేంద్ర మోడీ గడ్డం విషయం పై నడుస్తున్న చర్చ కూడా అలాంటిదే. అసలు మోడీ గడ్డానికి వెనక ఈ కథేమిటి అని అంటారా..? అదేమీ పెద్ద ముఖ్యమైనది కాదు కానీ మాట్లాడుకోకుండా ఉండలేని పరిస్థితి. విషయం ఏమిటంటే….

 

కరోనా లాక్ డౌన్ ప్రక్రియ మొదలైన తర్వాత చాలా మంది పురుషులు గడ్డలతో కనిపిస్తున్నారు… అది మన రోజూ చూస్తూనే ఉన్నాం. ఇంకా కావాలంటే టీవీ సీరియళ్లు, రియాలిటీ షో లో వచ్చే సెలబ్రిటీలు కూడా గడ్డలు పెంచేసుకుని దేబ్యం ముఖం వేసుకుని కనిపిస్తున్నారు. వీరిలో ఎవరికీ సొంతంగా షేవింగ్ చేసుకోవడం రాదా.. అన్న ప్రశ్నలు మొదలవగా.. ఇప్పుడు ఆ సెలబ్రిటీలు అందరూ అయిపోయి చివరికి అంతా కలిసి మోడీ గడ్డం మీద పడ్డారు.

నిజంగానే మోడీ గడ్డం భారీగా పెరిగిపోసాగింది. మొదటి లాక్ దౌన్ నుండి కూడా లేకుండా అలాగే వదిలేశాడు. ఆయనకు ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఏదైనా దీక్షలో ఉండొచ్చు లేదా…. మొక్కు మొక్కుకొని ఉండొచ్చు. దానిపై ఇంటర్నెట్ లో కాంగ్రెస్ నాయకులు, జర్నలిస్టులు చిల్లర చర్చలు…. కామెంట్లు, రకరకాల భాష్యాలు మాత్రం మారడం లేదు. ఇక శిశి థరూర్ అనే ఒక మేధావి మోడీ గడ్డపై వింత వ్యాఖ్యలు చేశారు. “లాక్ డౌన్ నుండి కాదు అయోధ్యపై కోర్టు తీర్పు నుండి మోడీ గడ్డం భారీగా పెరిగిపోయింది. అతనే మన రాజసన్యాసి టైప్ ఇమేజీ కోరుకుంటున్నాడా…? నిజం చెప్పాలంటే పెరిగిన గడ్డం హిందూ మిలిటెన్సీ సూచిక లా ఉంది,” అని మరి అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేశారు.

ఇక మనల్ని నెటిజన్ల సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా బోలెడు వ్యాఖ్యలు విసుర్లు. కలకత్తా నుంచి ఒకడు, “ఏమయ్యా మోడీ… మా రవీంద్రనాథ్ ఠాగూర్ లా కనిపించాలని ప్రయత్నిస్తున్నావా..?” అంటాడు. మహారాష్ట్ర నుండి మరొకడు, “నువ్వు ఎన్ని వేషాలు వేసినా మా ఛత్రపతి శివాజీ లుక్ నీకు రాదు…. త్వరగా గడ్డం చేసుకోవడం మంచిది” అని అంటాడు. ఇంకా కొంతమంది. అయితే గడ్డానికి మతానికి ముడి పెట్టడం స్టార్ట్ చేశారట.

మోడీ వాచీలు ధర, చెప్పులు బ్రాండ్, కోటు విలువ మీద ఆరాతీసి తమ ఇష్టం వచ్చిన సంఖ్య వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకునే వారు.. ఇప్పుడు చివరికి గడ్డం వరకు వచ్చేశారు. లాక్ డౌన్ లో అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టడం మానేసి తన బుర్ర లతో ఆలోచిస్తారు అనుకుంటే…. ఆ బుర్రలనే ఏకంగా ‘లాక్’ చేసి మరింత ‘డౌన్’ కి దిగజారిపోయారు జనాలు.

Related posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju