NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎవరు ఈ  న్యాయవాది శ్రవణ్ కుమార్ – జగన్ మీద అంత కోపంగా ఎందుకు ఉన్నాడు ఈయన ?

ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేసే విధంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా పనిచేసే వ్యవస్థలపై నిఘా పెట్టినట్లు అనేకమంది విపక్షాల పార్టీల నాయకులు మరికొంత మంది న్యాయవాదులు తాజాగా ఆరోపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల న్యాయవాదుల ఫోన్ టాపింగ్ విషయంలో ఏపీ ప్రభుత్వం పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి  పత్రిక ఈ కథనాన్ని ప్రచురించి వివాదానికి తెర లేపడం తో జగన్ ప్రభుత్వం పై టిడిపి పార్టీ నాయకులు మరికొంత మంది న్యాయవాదులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఏకంగా ప్రధాని మోడీ కి లెటర్ కూడా రాశారు.

Jagan seeks Modi's help to boost medical infrastructure in APఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేంద్రం కలుగు చేసుకోవాలని ప్రజల హక్కులను కాలరాస్తూ జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్లు మోడీకి బాబు లెటర్ రాయడం జరిగింది. ఇదిలా ఉండగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల “ఫోన్ ట్యాపింగ్” ఈ వ్యవహారంపై సీనియర్ న్యాయవాది శ్రావణ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. న్యాయవ్యవస్థను అత్యంత గౌరవం గా చూసే శ్రావణ్ కుమార్, గతంలోనే న్యాయవ్యవస్థపై ఏపీ అధికార పార్టీకి చెందిన నేతలు ఇష్టానుసారంగా మాట్లాడిన టైములో తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది. ఇలాంటి తరుణంలో తాజాగా “ఫోన్ ట్యాపింగ్” వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యనికి ఇలాంటి విషయాలు చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

 

అంతేకాకుండా ఆంధ్రజ్యోతి కథనం ఆధారం చేసుకుని హైకోర్టులో శ్రావణ్ కుమార్ పిల్ దాఖలు చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద విజయవాడకు చెందిన ఈ మాజీ న్యాయమూర్తి, హైకోర్టు సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ హైకోర్టులో ఈ విషయం తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు. న్యాయ స్థానాలపై నిఘా మేటర్ రుజువైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 356 ప్రకారం ప్రభుత్వాన్ని తక్షణమే భర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇదిలావుండగా తాజాగా శ్రవణ్ కుమార్ వేసిన పిల్ విచారణకు హైకోర్టు స్వీకరించింది. మరోపక్క ఏపీ ప్రభుత్వం అదంతా తప్పుడు కథనాలని, కొట్టిపారేస్తోంది. అంతేకాకుండా వార్త రాసిన ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు ఇవ్వటం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రజ్యోతి పత్రిక తమ దగ్గర పక్కా సమాచారం, ఆధారాలున్నాయి కాబట్టే రాశాం అని చెబుతోంది. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది అన్నది ప్రజెంట్ సస్పెన్స్ గా ఉంది.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N