NewsOrbit
న్యూస్ రివ్యూలు

లూట్ కేస్ రివ్యూ – కామెడీ అండ్ కాస్త బోరింగ్ కానీ చూడాల్సిందే !

ఇంట్రడక్షన్:

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ వల్ల సినిమా థియేటర్లు ఇంకా అన్నీ క్లోజ్ అయ్యే ఉన్నాయి. దీంతో చాలా వరకు సినిమాల నిర్మాతలు డిజిటల్ ప్లాట్ ఫామ్ ఓటిటి లను నమ్ముకుంటున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఉన్న సినిమాలు చాలా వరకు ఓటిటీ లో రిలీజ్ అయిపోతున్నాయి. ఈ విధంగానే తాజాగా కామెడీ తరహాలో “లూట్ కేస్” అనే సినిమా రిలీజ్ అయింది.

 

Lootcase Movie Review - Fun Comic Caper Despite The Not So Novel Plotస్టోరీ:-

కొన్ని మధ్యతరగతి కుటుంబాలు అంతా కలిసి ఉండే చోట 30 సంవత్సరాల చిరుద్యోగి నందన్ (కునాల్ ఖేము) అద్దెకు ఉంటాడు. భార్య, 10 సంవత్సరాల కొడుకు వయసు కలిగిన నందన్ ఒక న్యూస్ పేపర్ ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తూ ఉంటాడు. ఇంటికి సంబంధించిన అదే గాని ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వారికి అతిథి మర్యాదలు చేయటంలో గాని అంత స్థోమత కూడా ఇతనికి ఉండదు. అటువంటి ఈ వ్యక్తి అర్ధరాత్రి ప్రెస్ లో పని ముగించుకుని ఇంటికి వస్తుండగా 30 కోట్లు విలువ చేసే రెండు వేల రూపాయలు కట్టాలి కలిగిన పెద్ద సూట్ కేస్ దొరుకుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే ఎలాగోలాగ ఇంటికి ఒక ఆటో డ్రైవర్ ద్వారా విషయం తెలియకుండా చేరుకుంటాడు. అయితే ఈ సూట్ కేస్ ఇంట్లో పెడితే భార్య కి అనుమానం వచ్చే అవకాశం ఉండటంతో తన ఇంటి పక్కనే పేరే వ్యక్తి అద్దెకు ఉండే ఆయన…. ఎప్పటి నుండో ఇంట్లో ఉండగా వేరే ఊరికి వెళ్లడంతో ఆ గదిలో ఈ సూట్ కేస్ ఎవరికి తెలియకుండా దాస్తాడు. తర్వాత డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి ఏం చేయాలి అన్న దాని గురించి నందన్ ఆలోచనలో పడతాడు. ఇదిలా ఉండగా అదే సూట్ కేస్ కోసం ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే ఒకరు, మరొక మినిస్టర్ తెగ వెతుకుతుంటారు. ఇంతలో పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ సూట్ కేస్ కోసం అన్వేషణ స్టార్ట్ చేస్తాడు. దీంతో సాఫీగా డబ్బులు ఖర్చు పెట్టుకుందాం అనుకున్నా నందన్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అన్నదే మిగతా స్టోరీ.

 

విశ్లేషణ:-

 

ఈ సినిమాలో నందన్ గా నటించిన కునాల్ ఖేము….. మధ్యతరగతి భర్తగా అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయాడు. చాలీచాలని జీతంతో కాపురం చేస్తూ కన్నకొడుకు అడిగే అవసరతలు కూడా తీర్చకుండా, వారికి ముద్దు ముచ్చట కూడా చూపించకుండా వచ్చే సన్నివేశాలు చాలా హైలెట్గా కామెడీగా ఉంటాయి. సినిమా దాదాపు చిన్న బడ్జెట్ కావడంతో నాలుగు గోడల మధ్య…. ఉండటంతో ఒక సీరియల్ లా చూసినంత సేపు వీక్షకులకు అనిపిస్తుందట. చాలా కష్టాలు పడే నందన్ కి కొన్ని కోట్ల విలువ చేసే సూట్ కేస్ దొరకడంతో ఆ సూట్ కేస్ తో నందన్ మాట్లాడే విధానం,… సంభాషణలు సినిమాకి హైలెట్ గా ఉంటాయి. అదే రీతిలో ఆఫీసులో వచ్చే సన్నివేశాలు, రెండు గ్యాంగ్ స్టార్ మధ్య జరిగే గొడవలు….. అస్సలు సూట్ కేస్ ఎవరి దగ్గర ఉంది అనే ఉత్కంఠ తో సాగే కథ, అదే తీరులో నందన్ ఎప్పుడు ఎలా దొరికిపోతాడు అనేది డైరెక్టర్ రాజేష్ కృష్ణన్ అద్భుతంగా చిత్రీకరించాడు. సినిమాలో కెమెరా వర్క్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే ఉన్నాయి. 

రిజల్ట్:-

డబ్బు కావాలని తెగ తాపత్రయ పడే మధ్యతరగతి మనిషికి కొన్ని కోట్ల డబ్బులు వస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కామెడీ రూపంలో చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ సాధించారు. జీవితంలో డబ్బు ఎంత సంపాదించినా, మనిషి దగ్గర ఎంత ఉన్నా మనశ్శాంతి ఉండదని, నార్మల్ లైఫ్ యే బెటర్ అనే విధంగా డైరెక్టర్ ఈ లూట్ కేస్ సినిమాని చిత్రీకరించడం జరిగింది.

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju