NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

భారతదేశ రాజకీయాలలో పేరొందిన అపార రాజకీయ చాణిక్యుడు ప్రణబ్ ముఖర్జీ ..!!

ప్రణబ్ ముఖర్జీ సమకాలీన రాజనీతిజ్ఞలలో మంచి పట్టున్నవాడు. సంక్షోభ సమయాల్లో చిక్కు ముడులను అవలీలగా విప్పే నేర్పరీ. పార్లమెంటరీ వ్యవస్థను అవపోసన పట్టిన ఈ అపర చాణిక్యుడు గత ఏడాది భారతరత్న పురస్కారంతో సత్కరించింది. కేంద్ర మంత్రిగా పలు శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించిన ప్రణబ్… తెరవెనుక మంత్రాంగం నడపడంలో ను సిద్ధహస్తుడుగా దేశ రాజకీయాల్లో మంచి పేరు ఉంది. రాజకీయాలలో అనేక ఎత్తుపల్లాలు చూసిన ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మిరాటిలో 1935 డిసెంబర్ 11న జన్మించారు. పొలిటికల్ సైన్స్ చరిత్రలో ఎం.ఏ చేసిన ఆయన కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందారు. రాజకీయాలలోకి రాకముందు క్లర్కుగా అధ్యాపకుడిగా పాత్రికేయుడిగా పనిచేశారు.

Pranab Mukherjee ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన కుమారుడు అభిజిత్ ముఖర్జీ - Telugu Oneindia1969లో ఇందిరాగాంధీ హయాంలో పొలిటికల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన ప్రణబ్ ముఖర్జీ 1982 లో అతి చిన్న వయసులోనే కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏ అంశంపైనైనా అనర్గళంగా ప్రసంగించే గలిగే ప్రణబ్ చాణక్యం, హాస్య చాతుర్యం, గాంభీర్యం, ఆగ్రహం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రదర్శించాలో తెలిసిన వ్యక్తి అని ఆయన సహచరులు కొనియాడు తుంటరు. కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక విదేశాంగ రక్షణ శాఖ మంత్రి గా సేవలను అందించారు.

2012 నుంచి 2017 వరకు దేశ 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతిగా తనదైన శైలిలో ప్రణబ్ ముఖర్జీ రాణించారు. రాష్ట్రపతిగా కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ తన ప్రత్యేకత చాటుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ న్, రాజేంద్ర ప్రసాద్, జాకీర్ హుస్సేన్, వివి గిరి ల తర్వాత భారతరత్న పొందిన రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు.

1984 లో యూరప్ లో ఓ ప్రముఖ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ప్రణబ్ ముఖర్జీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా సెలక్ట్ అయ్యారు. 1991-1996 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బాధ్యతలు చేపట్టారు. 1987 -1989 మధ్య ఏఐసీసీ ఆర్థిక సలహా మండలి చైర్మన్ గా రాణించారు. కాంగ్రెస్ పార్టీలోనే పార్లమెంట్ వ్యవహారాల లోనూ అనేక సంక్షోభాలు పరిష్కరించి తన చాణక్య ని ప్రదర్శించారు. 2004, 2009 ప్రత్యక్ష ఎన్నికల్లో తప్పించి ప్రణబ్ ఎప్పుడు లోక్ సభ కు ఎన్నిక కాలేదు. ఇందిరాగాంధీ ఆయనకు ఎన్నో కీలక బాధ్యతలు అప్పచెప్పారు.

ఇందిరాగాంధీ గైర్హాజరు లో మంత్రివర్గ సమావేశాలకు మిగిలిన వారి కంటే జూనియర్ అయిన ప్రణబ్ కే అధ్యక్షత వహించే అవకాశం కల్పించేవారు. రాజీవ్ గాంధీతో విభేదాల కారణంగా 1986 లో రాష్ట్రీయ సమాజ్ వాది కాంగ్రెస్  పార్టీని స్థాపించిన ప్రణబ్ మళ్లీ కాంగ్రెస్ గూటి కే చేరారు. దేశ రాజకీయాలలో అత్యుత్తమ ప్రమాణాలను అనుసరించిన ప్రణబ్ ముఖర్జీకి 2008వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందించింది.

 

భారత రత్న వచ్చిన సమయంలో ప్రణబ్ ఈ విధంగా స్పందించారు. దేశ ప్రజలకు తాను చేసిన దానికంటే ప్రజలే తనకు ఎక్కువ ఇచ్చారని అప్పట్లో సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల కొన్నాళ్లుగా అనారోగ్యం, కరోనా వైరస్ కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆసుపత్రిలో ప్రణబ్ ముఖర్జీకి  చికిత్స అందించిన ఫలితం లేకపోవటంతో ప్రణబ్ ముఖర్జీ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ప్రణబ్ మృతికి దేశ రాష్ట్ర రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju