బిగ్ బాస్ – 4 లోని కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా హౌస్ లోకి వెళ్తున్నారు. అయితే ప్రతిసారి లాగే ఈసారి కూడా కంటెస్టెంట్స్ ఎవరో ఒకరి మధ్య ప్రేమ చిగురిస్తుంది అని అభిమానులు ఆశించారు. గతంలో సామ్రాట్–తేజస్విని, రాహుల్–పునర్నవి ప్రేమ జంటలుగా ప్రేక్షకులని మెప్పించారు.
అయితే మొదటి ఎపిసోడ్ లోనే వారికి కనెక్షన్ అవుతుంది అని మాత్రం ఊహించలేదు. వారే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో ‘అభిజిత్‘, ‘దేత్తడి‘ యూట్యూబ్ ఛానల్ సెన్సేషన్ హారిక. బిగ్ బాస్ హౌస్ లోనికి వెళ్ళేటప్పుడు వారు ఒక బాక్స్ తీసుకెళ్తారు. దాంతో వారి పార్ట్నర్ ని వెతుక్కుంటారు.
అయితే అభిజిత్ తీసుకొని వెళ్ళిన బాక్స్ లో షూస్ ఉండగా…. హారిక తీసుకొని వెళ్ళిన బాక్స్ లో సాక్స్ ఉన్నాయి. అంటే వీరిరువురు ప్రస్తుతం ఒక జంట అన్నమాట. పైగా స్టేజి మీద కూడా నాగార్జున హారిక లోపలికి వెళ్ళిన తర్వాత కచ్చితంగా అభిజిత్ తోనే అని కలుస్తుందని జోస్యం చెప్పేశారు. బిగ్ బాస్ ఈ ప్రేమ జంట మధ్య ఏదైనా కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవుతుందా లేదా తగాదాలు పడతారా అన్నది వేచి చూడాలి.