NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

మూడు రాజధానులపై మరో మారు క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్

(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల అంశంపై మరో మారు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సిఆర్‌డిఏ రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ ఆమోదం పొందగా, ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టు విచారణలో ఉన్న తారణంగా విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రాజధానులు ఏర్పాటు ఎందుకు చేయాల్సి వస్తుంది? అమరావతిలో ఎందుకు కొనసాగించదలుచుకోలేదు? తదితర విషయాలపై జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిఎం జగన్మోహనరెడ్డి వెల్లడించారు.

ap cm ys jagan

పెట్టుబడులు అన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదు. అలా చేస్తే ఒకే ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందని జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. చెన్నై, హైదరాబాద్ ద్వారా ఇప్పటికే నష్టపోయిన విషయం చరిత్ర చెబుతోందన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జస్టిస్ శివరామకృష్ణయ్య కమిటీ చెప్పిన విధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని మరో మారు స్పష్టం చేశారు జగన్మోహనరెడ్డి. 1990లో హైదరాబాద్‌లో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ మాదిరిగానే అమరావతిలోనూ ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనీ, వాటిపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందనీ చెప్పారు. ఈ దర్యాప్తులో బినామీలంతా బయటపడటం ఖాయమని జగన్ పేర్కొన్నారు.

రాజధాని కోసం వేల ఎకరాలు, లక్షల కోట్లు అవసరం లేదనీ పేర్కొంటూ ఒకటి రెండు మినహాయిస్తే ప్రపంచంలో ఎక్కడా కూడా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీలు సఫలం కాలేదని అన్నారు జగన్. సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ వల్ల అభివృద్ధి జరగని భావిస్తున్న వాళ్ళు అమరావతిలోనే ఇవన్నీ ఉండాలని ఎందుకు పట్టుబడుతున్నారని జగన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే అమరావతిలో రాజధాని నిర్మాణాలు చేయాలంటే లక్ష కోట్లు ఖర్చు అవుతుందనీ, ఆ ప్రాంతం కూడా భారీ నిర్మాణాలకు అనువైనదీ కాదనీ అన్నారు సిఎం జగన్.

రాజధాని నిర్మాణానికి 500 ఎకరాలు చాలని శివరామకృష్ణయ్య కమిటీ నివేదికలో పేర్కొంటే..చంద్రబాబు 33 వేల ఎకరాలు ఎందుకు సేకరించారనీ జగన్ ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణను అమరావతి ప్రాంత 29 గ్రామాలలోని పదివేల మంది రైతులు మాత్రమే వ్యక్తిగత కారణాల వల్ల వ్యతిరేకిస్తున్నారనీ, రాష్ట్ర ప్రజలు అందరూ వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారనీ పేర్కొన్నారు వైఎస్ జగన్.

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju