NewsOrbit
న్యూస్

షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల జాబితా

అమరావతి, ఫిబ్రవరి 16:  అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా టిడిపి అభ్యర్థుల ఎంపిక జాబితా ఉంటుందని మంత్రి కాలవ శ్రీనివాసులు వెల్లడించారు.

టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శనివారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది.

ముందుగా పుల్వామా ఉగ్రదాడిలో  అసువులు బాసిన సిఆర్‌పిఎఫ్ జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.

సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాలవ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్‌లు మీడియాకు వెళ్లడించారు.

వారు వెల్లడించిన ముఖ్య అంశాలు

  • రేపటి నుండే పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించడం.
  • పనితీరు, సమర్థత ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.
  • ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటన.
  • ఎన్నికల వ్యవహారాల కోసం ప్రత్యేకంగా స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు.
  • మానిఫెస్టో కమిటీ ఏర్పాటు బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అప్పగింత.
  • సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువేళ్లే అంశంపై ప్రణాళిక రూపకల్పన

తెలంగాణాలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై పూర్తి అధికారం తెలంగాణ పార్టీ కమిటీకి అప్పగిస్తూ తీర్మానించడం జరిగిందని వారు తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు మంత్రులు, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు గైర్హజరు అయ్యారు.

 

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Leave a Comment