NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

అజయ్ కల్లమ్ గారిని అలా వాడేసారా..?

 

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొందరు అక్రమార్కులు ఏకంగా సీఎంఒ కార్యాలయ ఉన్నతాధికారుల పేరుతో అక్రమ దందాలకు తెరలేపారు. ఇటీవల కాలంలో వెలుగు చూసిన రెండు సంఘటనలు వీటిని దృవపరుస్తున్నాయి. రాష్ట్రంలో ఇవి తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. శిరోముండనం కేసులో భార్యతో సహా నిందితుడైన సినీ నిర్మాత నూతన నాయుడు ఏకంగా సీఎం పేషీలోని సీనియర్ ఐఎఎస్ అధికారి పివి రమేష్ పేరును ఉపయోగించి దందాలకు పాల్పడిన విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది రోజులకే ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారు అజయ్ కళ్లాం రెడ్డి పేరుతో ఒ ముఠా అక్రమ దందాలు నెరిపిన వైనం బహిర్గతం కావడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. జరిగిన దందాలపై నాడు సీఎంఒ పేషీలోని సీనియర్ ఐఎఎస్ అధికారి రమేష్, నేడు ముఖ్యమంత్రి సలహాదారు , రిటైర్డ్ ఐఎఎస్ అజయ్ కళ్లాం రెడ్డిలు నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేయడం గమనార్హం.

అజయ్ కళ్లాం రెడ్డి పేరుతో నిరుద్యోగులకు టోకరా

విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన ఒక ముఠా రంగంలోకి నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, తమకు సీఎం సలహాదారు అజయ్ కళ్లాం రెడ్డి బాగా తెలుసు అంటూ ప్రచారం చేసుకున్నారు. జూనియర్ లైన్ మెన్ పోస్టులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వాట్స్‌ప్ సందేశాలు ఇచ్చి నిరుద్యోగ యువతను బుట్టలో వేసుకుంది ఈ ముఠా. నిరుద్యోగుల నుండి  లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. అజయ్ కళ్లాం రెడ్డి పేరు చెప్పడంతో ఎలాగైనా ఉద్యోగం వస్తుందని నిరుద్యోగులు భావించారు. తీరా డబ్బులు చెల్లించిన వారికి ఉద్యోగాలు రాకపోవడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. ఈ విషయం చివరకు అజయ్ కళ్లాం కూడా తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. నేరుగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫోన్ చేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 మంగళగిరిలో కేసు నమోదు

డీజీపీ గౌతమ్ సవాంగ్.. అజయ్ కళ్లాం రెడ్డి నుండి అందిన ఫిర్యాదును గుంటూరు అర్బన్ పోలీసులకు పంపగా వారు విచారణ జరిపారు. మంగళగిరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్ద సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా పని చేస్తున్న మేకా వెంకటరెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారట. అయితే ఈ వ్యవహారంలో తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు జంగాల సాంబశివరావు, నేటి ఆంధ్రా.కామ్ నిర్వహకుడు కీలకపాత్రులుగా పోలీసులు గుర్తించారుట. అయితే అధికార పార్టీ నేతలు చేసిన దందాను తప్పుదోవ పట్టించేందుకు తెలుగుదేశం పార్టీ వారికి ముడిపెట్టాలా  చేస్తున్నారంటూ నేటి ఆంధ్రా.కామ్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ దందా మొత్తం వైసీపీకి చెందిన వారే నిర్వహించారని ఆ సైట్ పేర్కొన్నది.

 

 

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju