NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జనాగ్రహానికి టీఆర్ఎస్ జడిసిందా! గ్రేటర్ ఎన్నికలు వాయిదా పడేనా?

గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు వాయిదా పడే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.వానలు వరదలు కారణంగా చూపి ముఖ్యమంత్రి కేసీఆరే ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ ఎన్నికలను వాయిదా వేయించవచ్చునని ఆ వర్గాలు అంటున్నాయి.అయితే ఇందుకు కారణం ప్రజలపై ప్రేమతో కానేకాదు.వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కెసిఆర్ ఈ ఎన్నికలను వెనక్కు జరపాలని అనుకోవడం లేదు.హైద్రాబాద్ వరదలు టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేశాయి.గత ఎన్నికల్లో తొంభై తొమ్మిది డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకోగా ఈసారి ఎన్నికల్లో వంద పైమాటేనని తరచూ కెసిఆర్ తనయుడు పట్టణాభివృద్ధి శాఖ కెటిఆర్ చెబుతుంటారు.

TRS is attached to the population! Whether the Greater Elections will be postponed
TRS is attached to the population! Whether the Greater Elections will be postponed

అసలు తమకు కార్పోరేషన్లో పోటి కూడా లేదని కేటీఆర్ అనేవారు మీడియా సమావేశాల్లో ఇదే ధీమా ఆయన వ్యక్తం చేసేవారు.నగరంలో విస్తృతంగా పర్యటిస్తూ ఇదంతా టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అని కూడా ఆయన ప్రజలకు చెప్పేవారు.కానీ ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా హైద్రాబాద్ మహానగరం దాదాపు జల సమాధి అయిపోయిన పరిస్థితులు తలెత్తడంతో టీఆర్ఎస్ వారికి సౌండ్ పడిపోయింది.వరదల కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం చూసేసరికి అధికార పార్టీ నగరాన్ని ఎంత అభివృద్ధి చేసిందో జనాలకు కళ్ళకు కట్టినట్టు కనబడింది.దీంతో తిరుగుబాటు మొదలైంది పరామర్శించడానికి వెళ్లిన టీఆర్ఎస్ నేతలను ప్రజలు తరిమి తరిమి కొట్టే వరకు పరిస్థితి వచ్చింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,కార్పోరేటర్లు ఆఖరికి మంత్రులు కనిపించినా ప్రజలు మీద పడుతున్నారు.నాలాలు పూడికలు, రోడ్ల వెడల్పు, చిన్నా చితకా  చెరువులను పరిరక్షించడం, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ ఇలా పలు విషయాల్లో  ప్రభుత్వం  విఫలమైందని జనం వారిని కడిగేస్తున్నారు.

TRS is attached to the population! Whether the Greater Elections will be postponed
TRS is attached to the population! Whether the Greater Elections will be postponed

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే టీఆర్ఎస్ గెలవడం అసంభవమని ఆ పార్టీ అగ్రనేతలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దగ్గర మొత్తుకున్నారట.ప్రజల కోపం తగ్గేవరకూ ఆగి ఈలోపు కొన్ని అభివృద్ధి పనులు చేసి ఆ తర్వాత ఎన్నికలు పెడితే మంచిదని వారు అధి నాయకుడి దగ్గర చెప్పుకున్నారు. కెటిఆర్ కూడా ఇదే అభిప్రాయాలను తండ్రి దగ్గర వ్యక్తం చేశారని సమాచారం.దీంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ఎన్నికలను వాయిదా వేయడానికి గల మార్గాలను అన్వేషిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju