NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్, జ‌గ‌న్ స‌ర్కారు… మ‌న కోసం చేసే గొప్ప ప‌ని ఇదే

ద‌స‌రా పండుగ తెలుగ రాష్ట్రాల్లో మునుప‌టి ఉత్సాహంతో సాగ‌డం లేద‌నే సంగ‌తి తెలిసిందే. ఎందుకంటే క‌రోనా ఎఫెక్ట్‌. కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది దసరా కాస్త కళ తప్పింది. ఎప్పుడూ ఉండే సందడి కనిపించడం లేదు.

అయితే, ఎలాగోలా సొంతూరుకు వెళ్లైనా.. పండగ జరుపుకుందామని అనుకుంటున్న వారిని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోచుకుంటున్నాయి. మామూలుగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నప్పుడే.. పండగ సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్‌ దోపిడీ మాములుగా ఉండేది కాదు. అయితే ఇప్పుడు ఏపీ-తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ స‌మ‌యంలోనే పాల‌కులు ఒకింత ఉప‌శ‌మ‌నం క‌లిగించే నిర్ణ‌యం తీసుకుంది.

ఏపీఎస్ఆర్‌టీసీ ప్ర‌త్యేక ఏర్పాట్లు

లాక్ డౌన్ ముందు నిలిచిపోయిన ఏపీ, టీఎస్ మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఇప్పటికి పునరుద్ధరణ జరగలేదు. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలమయ్యాయి. కనీసం దసరాకైనా ఆర్టీసీ చర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఏపీకి వచ్చేవారి కోసం ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.. తెలంగాణ-ఏపీ బోర్డర్‌ నుంచి బస్సులు నడుపుతున్నట్టు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. ఇదే సమయంలో.. టీఎస్ఆర్టీసీ బస్సులు కూడా ఏపీ సరిహద్దు వరకు నడపాలని విజ్ఞప్తి చేశారు. దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ సరిహద్దు చెక్ పోస్టులు – పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెంల వద్ద ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ఈ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి కోరారు.

ప్రైవేట్ ట్రావెల్స్‌కు పండుగ

మ‌రోవైపు ప్రైవేట్ ట్రావెల్స్‌కు మాత్రం దసరా.. అసలైన పండగగా మారిపోయింది. దసరా నేపథ్యంలో ప్రయివేటు ట్రావెల్స్‌ యాజమాన్యాలు ఛార్జీల పేరుతో ప్రయాణికులను దోచుకుంటున్నాయి. ప్రయాణికుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నాయి. బెజవాడ నుంచి హైద్రాబాద్‌కి వెయ్యి నుంచి 1,200 వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ అయితే రాను, పోను టికెట్లు తీసుకున్న వారికి స్వల్ప రాయితీలు కూడా ఇచ్చేస్తున్నాయి. కాకినాడ- హైదరాబాద్‌కి బస్సు టిక్కెట్‌ సాధారణంగా నాన్‌ ఎసికి రూ.600- 650 చొప్పున వసూలు చేస్తారు. అదే ఏసీ బస్సులకు రూ.వెయ్యి వరకూ ఉంటుంది. కానీ ప్రస్తుతం నాన్‌ ఎసికి వెయ్యి నుంచి రూ.1,500, ఎసి బస్సులకు రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రతి ప్రయాణికుడిపై కనీసం రూ. 500 నుంచి రూ.వెయ్యి వరకూ అదనంగా భారం పడుతోంది. దీనికితోడు లగేజీ ఛార్జీలు వసూలు చేయకూడదనే నిబంధనలున్నప్పటికీ చిన్న చిన్న లగేజీలకు కూడా రూ.200కిపైగా వసూలు చేసేస్తున్నారు.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !