NewsOrbit
రాజ‌కీయాలు

జస్టిస్ రమణపై సుప్రీమ్ లో పిల్… కానీ వైసీపీ చేసిన తప్పు ఏమిటంటే..!?

pill on justice nv ramana can be a mistake by ysrcp

జస్టిస్ ఎన్వీ రమణకు వ్యతిరేకంగా.. వైసీపీకి అనుకూలంగా సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఈ పిటిషన్ వేసింది అనిల్ కుమార్ బోరుగడ్డ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే.. అనిల్ పై గతంలో చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు, అనేక మంది వైసీపీ అభిమానులు, జగన్ ఫాలోవర్స్ ఉండగా ఇన్ని కేసులున్న వ్యక్తి పిటిషన్ వేయడంపై విమర్శలు వస్తున్నాయి. అనిల్ పై గతంలో మోసపూరితమైన, నేరాలు చేసారనే అభియోగాలు ఉన్నాయి. పిటిషన్ వేసినందుకు సంతోషించేలోపు పిటిషన్ వేసేందుకు మరెవరూ దొరకలేదా అనే ప్రశ్నలూ వస్తున్నాయి. దీంతో ఈ పిటిషన్ పై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

pill on justice nv ramana can be a mistake by ysrcp
pill on justice nv ramana can be a mistake by ysrcp

ఎవరీ అనిల్ కుమార్ బోరుగడ్డ..

అనిల్ గుంటూరు నివాసి. కేంద్ర మంత్రి రామ్ నాధ్ అధవాలే స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్. నార్త్ లోనే పెద్దగా గుర్తింపు లేని పార్టీ. అనిల్ పై ఎన్నో అభియోగాలు, కేసులు ఉన్నాయి. మోసాలు, బెదిరింపులు, దందాలు, నకిలీ ఐడీ కార్డులతో అధికారులను మోసం చేయడం.. వంటి ఆరోపణలు కేసులు ఆయన మీద ఉన్నాయి. అమరావతి ప్రాంతంలో భూదందాలు చేస్తూ పోలీసులకు చిక్కాడు. గుంటూరులోని ఆరండల్ పేటలో ఆయనకు సైమన్స్ అమృత్ ఫౌండేషన్స్ అనే క్రిస్టియన్ సంస్థకు ఫౌండర్ కూడా. టీడీపీ హయాంలో చంద్రబాబుపై రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సమయంలో ఆయన పక్కనే ఉన్నాడు.

పార్టీ స్పందించకపోతే సీఎం జగన్ కే నష్టమా..

మంత్రి ఓఎస్డీ, ఐఏఎస్ ఆఫీసర్ నంటూ ఎన్నో వసూళ్లకు పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. జగన్ పై కత్తి దాడి జరిగినప్పుడు కూడా హైకోర్టులో కేసు వేశాడు. ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణపై సుప్రీంలో పిల్ వేశాడు. దీనికి సుప్రీంకోర్టు నుంచి అక్ నాలెడ్జ్ మెంట్ కూడా వచ్చింది. దీనిని తన ఫేస్ బుక్ లో కూడా పెట్టకున్నాడు. ఇలా ప్రచారానికి వాడుకుంటున్నాడు అని తెలిస్తే సుప్రీంకోర్టు ఆ వ్యాజ్యాన్ని క్యాన్సిల్ కూడా చేస్తుంది. ఇన్ని మోసాలు, ఆరోపణలు ఉన్న వ్యక్తి ఏపీ సీఎం కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే జగన్ పైనే మచ్చ రావడం ఖాయం. వైసీపీ అభిమానులు, పార్టీ నేతలు ఇదే చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో పార్టీ ఆ పిల్ వెనక్కు తీసుకునేలా వ్యవహరిస్తే బాగుండును అని.

 

 

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju