NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

కోటి రూపాయల బెంజ్..! ఎలక్ట్రిక్ యుగంలో కొత్త చరిత్ర..!!

 

ఎట్టకేలకు మొదటి లగ్జరీఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్ లోకి ప్రవేశించింది. బెంజ్ కారు మార్కెట్లోకి వస్తుందంటే వాహన ప్రియుల చూపులు ఆ వాహనంపైనే ఉంటుంది. లగ్జరీ కార్ల ఉత్పత్తిలో తనకు తానే సాటి అనిపించుకున్న ప్రముఖ వాహన సంస్థ మెర్సిడెజ్ బెంజ్ తన ఈక్యూసీ ఎలక్ట్రిక్ ఎస్ యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. భారత్ లో విడుదలైన తొలి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్ యూవీగా ఇది గుర్తింపు తెచ్చుకుంది.


దీని ఎక్స్ షోరూం ధర 99 లక్షల 30 వేల రూపాయలు. ఇతర పన్నులతో కలిపి ఆన్ రోడ్ ధర కోటి రూపాయల వరకు ఉంటుంది. కానీ ఈ ధర మొదటి 50 కార్లకు మాత్రమే పరిమితం చేయబడింది. తరువాత దీన్ని ధర మరింత పెరగవచ్చు.

మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ రెండు ఎలక్ట్రిక్ మోటార్లను కలిగి ఉంది. ప్రతి ఎక్సెల్ ఒక్కో మోటార్ ను అమర్చారు. 4-వీల్ డ్రైవ్ సిస్టంతో పాటు 80 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ బ్యాక్ ను కలిగి ఉంది. ఇది కాకుండా మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ 405 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 765 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా సింగిల్ ఛార్జింగ్ 471 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంతేకాకుండా 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 5.1 సెకండ్లలోనే అందుకుంటుందని కంపెనీ చెప్పింది. గరిష్ఠంగా గంటకు 180 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంది. అంతేకాకుండా కేవలం 40 నిమిషాల్లోనే 80 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది.

సరికొత్త లగ్జరీ ఎస్ యూవీ డిజైన్ విషయానికొస్తే జీఎల్సీ ఎస్ యూవీ మాదిరే ఉంది. ఫ్రంట్ గ్రిల్, అతిపెద్ద త్రీ పాయింటెడ్ స్టార్, స్టైలిష్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ ప్రొజెక్టర్ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్, డబుల్ అప్ టర్న్ సిగ్నల్ ఇండికేటర్ ను కలిగి ఉంది. ఇవికాకుండా ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ స్ట్రిప్ రన్నింగ్ ఎక్రాస్ విడ్త్ బూట్ ను కలిగి ఉంది. దీనిలో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇందులోని డ్యూయల్ టోన్ 10.3 అంగుళాల డిస్ ప్లే, ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, ఇవేకాకుండా ఎంబీయూఎక్స్ కనెక్టెడ్ టెక్నాలజీ లాంటి తదితర ఫీచర్లను కలిగి ఉంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju