NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దీపావళి టపాసులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

 

(హైదరాబాదు నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి)

దీపావళి పండుగపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టపాసులు (బాణాసంచా) బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీపావళి టపాసులు కాల్చడం వల్ల శ్వాస కోస ఇబ్బందులు తలెత్తుతాయని, వీటిని నిషేదించాలని కోరుతూ న్యాయవాది ఇంద్రప్రకాష్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిల్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. క్రాకర్స్ కాల్చడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. టపాసులు బ్యాన్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో తెరిచిన షాపులను మూసివేయాలని ఆదేశించింది. ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా వారిపై కేసులు నమోదు చేయాలని పేర్కొంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఈ నెల 19న ప్రభుత్వం  తెలిపాలని హైకోర్టు ఆదేశించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో టపాసుల వినియోగంపై నిషేదం విధించడం ఉత్తమమని అభిప్రాయపడిన హైకోర్టు.. ప్రభుత్వం దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టపాసులను నిషేదించిన విషయాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తు చేసింది. టపాసులను బ్యాన్ చేయాలని రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నది. కోల్‌కత్తాలో టపాసులు బ్యాన్ చేయకపోతే తామే స్వయంగా రంగంలోకి దిగి నిషేదిస్తామని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయస్థానం గుర్తు చేసింది.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు కర్నాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే టపాసుల విక్రయాలను నిషేదించారు.ఏపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రెండు గంటల పాటు మాత్రం టపాసులు కాల్చడానికి ఇప్పటికే అనుమతి ఇచ్చాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju