NewsOrbit
రాజ‌కీయాలు

సీఎం జగన్ × జస్టిస్ రమణ..! ఎవరి వ్యూహం వారిది.., ఎవరి భయం వారిది..!!

YS Jagan : Failed.. Key Issues in Supreem

రాష్ట్ర ప్రభుత్వానికి.. రాజ్యాంగ వ్యవస్థ మధ్య పోరు మరో అంకానికి సిద్ధమవుతోంది. ఇది ఏస్థాయిలో ఉంటుందో.. ఎవరు గెలుస్తారో.. ఎవరు బలవుతారో.. ఎత్తుకు పైఎత్తులు తప్పితే గెలుపు ఎవరిదో చెప్పడం కష్టమే. వారే.. ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ. ఇద్దరూ అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులే. ఇద్దరి మధ్యా పరోక్ష యుద్దం జరుగుతుందని వారిద్దరు కూడా ఉహించి ఉండరు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో ఏపీ హైకోర్టు తీర్పులను ప్రభావితం చేస్తున్నారని జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈమేరకు జగన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు నవంబర్ 16 నుంచి సుప్రీంకోర్టులో విచారణకు రానున్నాయి. అయితే.. ఇద్దరిలో ఎవరి భయాలు వారికి ఉన్నాయి.

strategies of cm jagan vs justice ramana
strategies of cm jagan vs justice ramana

సీఎం జగన్ నుంచి జస్టిస్ రమణ ఊహించనిది..

సీఎం జగన్ తనపై ఇలా ఎదురుదాడి చేస్తారని రమణ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ.. జరిగింది. దీంతో రమణ ఇరకాటంలో పడ్డారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్న రమణకు ఆ హోదా దక్కకుండా చేయాలనేది జగన్ వ్యూహం. ఈ ఆరోపణలతో రమణను అత్యున్నత పదవికి దూరం చేస్తే తాను గెలిచచినట్టు, సుప్రీంకోర్టులో తనకు అనుకూల తీర్పు వచ్చే అవకాశం, న్యాయ వ్యవస్థపై కాస్త పట్టు దొరికినట్టు అవుతుంది. ఇందులో భాగంగానే ఆయన లేఖ రాసి బహిర్గతం చేశారు. అవసరమైతే ఈ అంశంపై మళ్లీ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసేందుకైనా, అభిశంసన తీర్మానం పెట్టడానికైనా సిద్ధగా ఉన్నారు. ఇందుకు జగన్ కు బీజేపీ సహకారమెంతో ప్రస్తుతానికి చెప్పలేం.

జగన్ దగ్గర వ్యూహాలు ఉన్నా కానీ..

మరోవైపు న్యాయవ్యవస్థలో ఉన్నత వ్యక్తితో తలపడుతున్నారు సీఎం జగన్. పైగా.. తనపై పిటిషన్లు దాఖలయ్యాయి. గతంలోని కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాను అనుకున్నది జరక్కపోతే, జస్టిస్ రమణ ఒకవేళ చీఫ్ జస్టిస్ అయితే, తనపై ఉన్న సీబీఐ కేసులు తెర మీదకు వస్తే.. అనే భయం కూడా ఆయనలో ఉంది. అయితే.. జగన్ కు ఉన్న ఈ భయమే రమణ వ్యూహంగా తెలుస్తోంది. తాను న్యాయమూర్తిగా ఉండి జగన్ ను డైరక్ట్ గా ఏమీ చేయలేరు. వ్యవస్థలతోనే ఏం చేసినా..! విషయం రాష్ట్రపతి వద్దకు వెళ్లినా, అభిశంసన తీర్మానం వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి. అమరావతి భూముల విషయంలో తన కుటుంబసభ్యులపై జగన్ చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించుకోవాలి కూడా.

రాజకీయ రంగు పులుముకుంటుందా..!

ప్రస్తుతం రమణ పరిస్థితి ఆచితేచి అడుగులేయడమే. కేంద్రంలో బీజేపీ వ్యవస్థలను శాసించే స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ జగన్ తోనే ఇలా చేయిస్తోందా అనే భయం రమణలో ఉంది. అమరావతి ఇన్ సైడర్ ట్రేడింగ్ లో తన కుటుంబసభ్యులపై ఆరోపణలు, టీడీపీతో రమణకు సాన్నిహిత్యం, చంద్రబాబు హయాంలో రమణకు చెందిన కొన్ని లావాదేవీలు జరగడం.. వీటిని జగన్ మీడియాకు వెల్లడించడం జస్టిస్ రమణను ఇరకాటంలో పడేసాయి. ఇలా వీరిద్దరిలో వ్యూహాలు.. భయాలు ఉన్నాయి. మరి.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో..!

Related posts

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju