NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బీహార్ దెబ్బకు తమిళనాడు హస్తంలో వణుకు

 

ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ పార్టీకు రోజులు బాగాలేనట్లు కనిపిస్తున్నాయి. వరుస ఓటములు ఆ పార్టీని కుంగదీస్తున్నాయి. ఇటు నేతలను కార్యకర్తలను నైరాశ్యంలో కి నెట్టేస్తున్నాయి. వరుసగా ఒక రాష్ట్రాన్ని అధికారం కోల్పోతున్న కాంగ్రెస్కు తాజా బీహార్ ఎన్నికల ఫలితాలు నోట్లో వెలక్కాయ పడిన చందంగా తయారయ్యాయి. ఆర్ జె డి తో కలిసి మహా బంధన్ పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కు వచ్చిన ఫలితాలు నిరాశ లోకి నెట్టేసాయి. శక్తికి మించి 70 స్థానాల్లో పోటీకి సై అన్న కాంగ్రెస్ పార్టీ కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇది మహా బంధం అధికార పీఠాన్ని కోల్పోయేలా చేసింది. క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కావాలని అధిక సీట్లను డిమాండ్ చేసి చివరకు ముఖ్యమంత్రి పీఠాన్ని కోల్పోయేలా చేసింది అనేది ఆర్జెడి వాదన. ఇప్పుడు బీహార్ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఇది పూర్తి ప్రభావం చూపనుంది. తమిళనాడులో అత్యంత వెనుకబడిన కాంగ్రెస్ పార్టీకి ఈ బీహార్ ఎన్నికల ఫలితాలు మరింత దూరానికి నెట్టేశాయి. డిఎంకె పార్టీతో పొత్తు లో ఉన్న కాంగ్రెస్ కు అక్కడ ఈ సారి నామమాత్రపు స్థానాలే పొత్తులో భాగంగా దక్కే అవకాశం కనిపిస్తోంది.

తమిళనాడులో పెద్దగా ఎం లేదు!!

డీఎంకే పార్టీ తో తమిళనాడులో ఎప్పటినుంచో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉంది. అయితే నామమాత్రంగానే ప్రభావం చూపుతోంది. 234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో 2016 ఎన్నికల్లో డీఎంకే పార్టీ పొత్తులో భాగంగా కాంగ్రెస్ కు దక్కిన స్థానాలు 41 స్థానాల్లో పోటీ పడిన కాంగ్రెస్ కేవలం 8 స్థానాల్లో విజయం సాధించింది. ఇది డీఎంకే కు అధికారం దూరం కావడానికి ప్రధాన కారణం. ఈ విషయాన్ని అప్పటి డీఎంకే నాయకుడు స్థాయిని సైతం ఒప్పుకున్నారు. 2011 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. తమిళనాడు కనీసం గుర్తించలేని పార్టీ గా మిగిలిపోయింది. 63 స్థానాల్లో పోటీకి నిలిస్తే కేవలం 5 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి మిత్ర పక్షానికి ఏ మాత్రం ఉపయోగపడింది జాతీయ పార్టీగా తమిళ్ నాడులో పేరు సంపాదించింది. ఇప్పుడు తాజా ఎన్నికల్లో బీహార్ ఫలితాలను డీఎంకే నిశితంగా గమనిస్తోంది. దేశవ్యాప్తంగా ఏమాత్రం ప్రభావం చూపని పార్టీగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుర్తిస్తున్న సమయంలో వచ్చే ఏడాది తమిళనాడు లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు ఇచ్చే సీట్లలో భారీగా కోత పెట్టాలని డీఎంకే అధినాయకత్వం భావిస్తోంది. స్టాలిన్ ఇప్పటికే దీనిపై పార్టీ నేతలకు తగు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. డీఎంకే తో పొత్తు లేకుంటే కాంగ్రెస్ పార్టీ కనీసం ఒకటి రెండు చోట్ల గెలిచే పరిస్థితి లేదు. దీంతో ఈ సారి డీఎంకే ఇచ్చే సీట్లలో ఎన్ని అయిన తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ ది.

డీఎంకేకు కాంగ్రెస్ కు మధ్య విభేదాలు ఉన్నాయి

రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు విషయంలో కాంగ్రెస్ పార్టీకి సీబీఐకి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇవి ఇటీవల పతాక స్థాయికి చేరాయి. రాజీవ్ హత్య కేసులో నిందితులు జైల్లో ఉన్న ఎనిమిది మందిని ఇటీవల విడుదల చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. అయితే ఇదే విషయంలో డిఎంకె నిందితుల తరపున మద్దతుగా నిలిచింది. కచ్చితంగా వారికి పడాల్సిన శిక్ష పడిందని వారిని విడుదల చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది. దీనిపై కాంగ్రెస్ డీఎంకే పార్టీ ల మధ్య విభేదాలు పొడచూపాయి. మిత్రపక్షాలు గా ఉన్న డీఎంకే కాంగ్రెస్ పార్టీలు ఒకే అంశం విషయంలో వివరంగా కనిపించడంతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తర్వాత ఈ అంశం మరుగునపడిన స్థానిక నాయకుల మధ్య ఈ విషయంలో ఇంకా మాటల తూటాలు పేలుతునే ఉన్నాయి. తమిళనాడు ఎన్నికలు ఎప్పటికీ ఒక ప్రత్యేకం. ఇక్కడ ఇచ్చే ఓటరు తీర్పు ఎప్పుడు విభిన్నంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల వైపు మొగ్గు చూపే ఇక్కడి ఓటర్లు ఈసారి బిజెపి కాంగ్రెస్ పార్టీలను ఏ విధంగా నమ్ముతారు అనేది పెద్ద ప్రశ్న. మరోపక్క రజనీకాంత్, కమల్ హాసన్ వంటి నటులు పార్టీలు పెట్టి పోటీకి సిద్ధంగా ఉన్నారు. వీరు ఎవరి పక్షం వహిస్తారు వీరు ఏ ఓటర్లను ప్రభావితం చేస్తారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వచ్చే ఏడాది మొదటి జరిగే తమిళనాడు ఎన్నికలు కాంగ్రెస్ కే కాదు.. ఎన్నో ప్రశ్నలు ఇంకెన్నో సమాధానాలకు వేదిక అవుతాయి.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N