NewsOrbit
న్యూస్ హెల్త్

చలికాలంలో వేడిని కలిగించే ఆహార పదార్థాలు ఇవే..!

కాలం మారుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడం సహజమే. అలాంటి వాతావరణానికి తగ్గట్టుగా మన ఆహార పదార్థాల విషయంలో మార్పులు సంతరించుకుంటాయి. ప్రస్తుతం చలి కాలం మొదలవడంతో వాతావరణ ఉష్ణోగ్రతలలో మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణం చాలా చల్లగా మారటం వల్ల మన శరీరానికి వేడిని కలిగించే ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మన శరీరం ఎంతో ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా, మన చర్మం కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది. ఈ చలి కాలంలో శరీరం మృదుత్వాన్ని కోల్పోవడంతో పాటు, అనేక రకాల చర్మ వ్యాధులకు దారితీస్తుంది. వీటన్నింటి నుంచి శరీరాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందే….

 

*ఆలివ్ ఆయిల్… ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, ఈ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉండటం వల్ల మన శరీరానికి కావల్సిన హైడ్రేషన్ ను అందించి మన శరీరానికి ఫ్లెక్సిబిలిటీ ని కలిగిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను తొలగించి శరీరానికి సహజ రంగును కోల్పోకుండా కాపాడుతుంది.

*క్యారెట్… చలికాలంలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలలో క్యారెట్ మొదటి స్థానంలో ఉంటుంది. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తుంది. విటమిన్ ఏ కంటిచూపును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. క్యారెట్లో ఉండే లైకోపిన్ సూర్యరశ్మి నుంచి మన శరీరాన్ని కాపాడుతుంది.క్యారెట్ జ్యూస్ రూపంలో లేదా పచ్చిగా తినడం వల్ల తగినన్ని పోషకాలు మన శరీరానికి అందుతాయి.

*పాలకూర… పాలకూరలో కేవలం ఐరన్ మాత్రమే కాకుండా అధిక మొత్తంలో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రక్తహీనతతో బాధపడే వారి చర్మం పాలిపోయినట్లు ఉంటుంది. అలాంటి వారు పాలకూర ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇందులో ఉన్న ఐరన్ రక్తహీనత సమస్య నుంచి విముక్తి కలిగించి మన చర్మాని కాంతివంతంగా ఉంచుతుంది.

*బాదం… ప్రతిరోజు బాధములను తీసుకోవడం ద్వారా మన శరీరానికి అవసరమైన డీహైడ్రేషన్ ను అందిస్తాయి.అంతే కాకుండా ఇందులో ఉండే పోషక పదార్థాలు మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ మన ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా మన చర్మం కాంతివంతంగా ఉండి ఆరోగ్యకరంగా ఉంటుంది.

*గ్రీన్ టీ… గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది.గ్రీన్ టీ ని తాగడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు. మన శరీరంలో ఏర్పడే ముడతలను నివారించడానికి గ్రీన్ టీ కీలక పాత్ర పోషిస్తుంది.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!