NewsOrbit
న్యూస్ హెల్త్

ఇలా చేస్తే త్వరగా మరియు సులభంగా బరువు తగ్గొచ్చు

ఇలా చేస్తే త్వరగా మరియు సులభంగా బరువు తగ్గొచ్చు

మెంతులను రోజూ వంటలలో వాడడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. వీటిని ఉపయోగించి ఆరోగ్యం తో పాటు అందంగా కూడా తయారవ్వొచ్చు. మనం రోజూ వంటల్లో ఉపయోగించే చాలా  పదార్థాలలో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల మన చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. మెంతులలో అనేక ఔషధగుణాలు ఉన్నాయి కాబట్టి మన పూర్వీకుల కాలం నుంచి మనం మెంతులని వంటలలో వాడుతూనే ఉన్నాం.

ఇలా చేస్తే త్వరగా మరియు సులభంగా బరువు తగ్గొచ్చు

మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మెంతుల్లో ఐరన్ శాతం పుష్కలంగా వుంటుంది. ఇది జుట్టుకు ఎంతో బలాన్నిచేకూరుస్తుంది. ఇంకా జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. రోజూ 15 గ్రాముల మెంతులను నీటిలో నానబెట్టి తీసుకుంటే అందం మరియు ఆరోగ్యంగా ఉండవచ్చు. మీరు చేయవలసినది ఏమిటంటే, రాత్రిపూట 2 -3 టీస్పూన్ల మెంతు గింజలను, అరకప్పు నీటిలో వేసి బాగా కలిపి, రాత్రంతా నానపెట్టాలి. రోజు ఉదయం లేవగానే మీరు ఈ విధంగా నానబపెట్టిన గింజలను నమలవచ్చు లేదా అలా నానబెట్టిన నీటితోనే ఆ గింజలను మింగేయవచ్చు.

అంతేకాకుండా, మీరు అలా నానబెట్టిన నీటిని త్రాగటం వల్ల మీకు చాలా  ఆరోగ్య ప్రయోజనాలను ఉంటాయంటున్నారు నిపుణులు. మెంతులు రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇవి తినడం వలన రక్తం శుద్ధి అవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

అలాగే మెంతులను బరువు తగ్గడానికి కూడా ఉపయోగించొచ్చు. మధుమేహం మీ దరిచేరదు. మెంతులను రాత్రి నానపెట్టి ఉదయం బాగా మెత్తగా రుబ్బుకుని తలకు షాంపులా ఉపయోగించి స్నానం చేస్తే జుట్టు వత్తుగా పెరుగుతుంది. వాత సంబంధిత సమస్యలకు కూడా మెంతులు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వేసవిలో రోజూ ఒక స్పూన్   నీటిలో మెంతులను నానబెట్టి మజ్జిగలో వేసుకుని తాగితే వడదెబ్బ నుంచి మిమ్మలిని మీరు కాపాడుకోవచ్చు.

మెంతులు మరియు ఉల్లి ముక్కలను నానపెట్టి రోజూ తీసుకుంటే వీర్యకణాలు వృద్ధి చెందుతాయి. మీరు నానబెట్టిన మెంతుగింజలను తినాలనుకున్నప్పుడు  ముందురోజు రాత్రి వాటిని నానపెట్టడం మరిచిపోతే, మీరు ఎం కంగారుపడక్కర్లేదు. మరిగించిన ఒక కప్పు నీటిలో ఈ గింజలను వేసి 5 – 10 నిమిషాల వరకు నానపెడితే చాలు. మీరు తినడానికి మెంతిగింజలు సిద్ధం అయిపోతాయి.

మెంతుల్లో ఎన్నో పోషకాలు, పీచు, ఇనుము, విటమిన్ సి, బి1, బి2 వంటి ఎన్నో ఆరోగ్యానకి మంచి చేసే పదార్థాలు ఉన్నాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకి ఒక మంచి ఔషధంగా పనిచేస్తాయి.

చాలా మంది మహిళలకు అనేక కారణాల వల్ల జుట్టు ఊడిపోతుందని బాధపడుతుంటారు. మెంతి ప్యాక్  ను తరచుగా వేసుకోవడం వల్ల ఈ సమస్య త్వరగా తగ్గిపోతుంది. మెంతి ప్యాక్ కోసం ముందురోజు మెంతులను పెరుగు, మజ్జిగ లేదా నీటిలో నానబెట్టి ఉంచి మరుసటి రోజు దానిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా పట్టి దాంతో ప్యాక్ వేసుకోండి. దీని వల్ల జుట్టు రాలే సమస్య త్వరగా తగ్గిపోతుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju