సినిమా రంగానికి సంబంధించిన వారిని పార్టీ పరంగా ఉపయోగించుకోవడంలో తెలుగు దేశం పార్టీ తర్వాతే ఎవరైనా. పార్టీని స్థాపించింది సినీ హీరో అయిన సీనియర్ ఎన్టీఆర్. అప్పటి నుండి ఇప్పటి బాలయ్య వరకు సినీ గ్లామర్ ప్రధానంగా తెలుగుదేశంతో ట్రావెల్ అవుతూనే ఉంది. అలాగే గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ఇమేజ్ ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీ లాభపడిందనేది కాదనలేని వాస్తవం. ఇక ప్రచార కార్యక్రమాల కోసం స్టార్ డైరెక్టర్స్‌ను కూడా తెలుగుదేశం వాడుకుంటుంది. గతంలో కె.రాఘవేంద్రరావు, రవిబాబు వంటి దర్శకుడు తెలుగుదేశానికి సంబంధించిన ప్రోమస్ను డైరెక్ట్ చేశారు కడా. అలాగే.. కొత్త రాజధాని నిర్మాణంలో రాజమౌళిని కూడా బాబు తెలివిగా ఇన్వాల్వ్ చేశారు. అలాగే గోదావరి పుష్కరాల సమయంలో బోయపాటి డాక్యుమెంటరీ చేశాడు. (ఆ సమయంలో తొక్కిసలాట జరిగి అమాయకులు కొంత మంది చనిపోయారు కూడా). ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీ.. దర్శకుడు బోయపాటిని తమ పార్టీ కోసం ఉపయోగించుకుంటుంది. వచ్చే ఎన్నికల కోసం తెలుగుదేశం ప్రమోషన్స్‌లో బోయపాటిని ఇన్వాల్వ్ చేశారట. బోయపాటి కూడా విజయవాడలో ఉంటూ తనదైన రీతిలో రాజకీయ సేవలో తరిస్తున్నాడని సమాచారం.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!