NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఏపీ కంపు తెలంగాణకు చేరింది..! తెలంగాణ వాకిటకూ కుల రాజకీయం..!?

రాజకీయాల్లో కులాలది కీలక పాత్ర. ఉత్తరాదిన మతాల రాజకీయాలు ఎంత బలంగా ఉంటాయో.., మనకు కుల రాజకీయాలు అంతే బలంగా ఉంటాయి..!! తెలుగు రాష్ట్రాల్లో చూస్తే తెలంగాణ కంటే ఏపీలోనే కుల రాజకీయాలు ఎక్కువ. కానీ.., ఇప్పుడిప్పుడే తెలంగాణలోనూ కుల కుంపటి.. కుల కంపు రగులుతుంది..!!

ఒక్క నిజం చెప్పుకోవాలంటే తెలుగునాట కులాల గొడవ మొదటి నుండి ఎక్కువే. ఎవరు ఏమనుకున్నా… 1978 లో రెడ్డి కాంగ్రెస్ ఏర్పాటు వెనుక ఒక కులం గొడవే.., 1983 లో టీడీపీ ఆవిర్భావం వెనుక ఒక కులం గొడవే.., 2009 లో ప్రజారాజ్యం ఆవిర్భావం ఓ కులం కోసమే..! ఇప్పుడు జనసేన అభద్రతతో పయనిస్తున్నది ఒక కులం మీదనే.. చివరికి జగన్ ఉన్న రాజకీయ బాట కులం తోనే, కుల రాజకీయమే..!! కాకపోతే తెలంగాణ సెంటిమెంట్ రగిలిన తర్వాత వారిలో కులం ప్రస్తావన తగ్గింది. ప్రాంతీయత ముందు కులం ఓడిపోయింది. అందుకే తెలంగాణాలో ప్రత్యేక అంశం వచ్చింది. ఆ రాష్ట్రం సాధించుకుని.., ఏడేళ్లు గడుస్తున్న వేళ ఇప్పుడిప్పుడే తెలంగాణాలో కుల కుంపట్లు అంటుకుంటున్నయ్. పనిలో పనిగా మత రాజకీయాలు కూడా మొదలైనయ్..!!

ఏపీలో నెమ్మదిగా మారుతుంది…!!

ఏపీలో రాజకీయం కమ్మ, రెడ్డి సామాజికవర్గాల చేతిలోనే ఉండేది. కాపు సామాజికవర్గం పెత్తనం కోసం పోరాడినా.., కమ్మ, రెడ్డి వర్గాల్లో ఉండే ఐక్యత, ఆర్ధిక మద్దతు, కన్నింగ్ నెస్ లేకపోవడంతో కాస్త వెనుకబడ్డారు. కానీ కాపు వర్గం ఓట్లు ఎక్కువ, సీట్లు ఎక్కువ. ఈ వర్గం మద్దతు లేకుండా ఎవరైనా అధికారంలోకి రావడం కష్టం.., కానీ ఈ వర్గం మాత్రం పూర్తి పెత్తనం తీసుకోలేకపోతుంది. కానీ ఏపీలో ఈ మూడు సామాజికవర్గాలు కీలకం. బీసీలు, ఇతర కులాలు ఈ మూడింటి వెనుక ఉంటూ జేజేలు కొట్టే పరిస్థితి దశాబ్దాల నుండి కొనసాగుతుంది. టీడీపీ – కమ్మ.., వైసీపీ – రెడ్డి కేంద్రాలుగా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ కులాలు.. పెద్దలు ఇతర కులాల ఓట్ల కోసం అంతర్గత రాజకీయాలు చేస్తుంటారు. ఇది ఏపీలో సహజంగానే ఉంది. తెలంగాణాలో చూసుకుంటే..!!

తెలంగాణాలో దొర X రెడ్డి..!!

తెలంగాణ అంటే దొరలు, రెడ్డిలు ఎక్కువగా పై స్థాయిలో ఉన్నారు. కొన్ని జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం బాగానే ఉంది. ఒక సర్వే ప్రకారం కోస్తా 9 జిల్లాల్లో 32 శాతం ఉన్నత సామజిక వర్గాలు (కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, రాజులు) ఓట్లు ఉంటె.., రాయలసీమలో 24 శాతం ఉండగా.., తెలంగాణాలో మాత్రం 14 శాతం మాత్రమే ఉన్నారు. అంటే ఏపీలోని జిల్లాలతో పోలిస్తే తెలంగాణాలో ఉన్నత సామజిక వర్గాలు తక్కువే. అక్కడ ఉనికి కోసం, పెత్తనం కోసం దొర (వెలమ).., రెడ్డి సామాజికవర్గాల్లో మాత్రం పోరాటం ఉంది. ఇన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ తో మాత్రమే రాజకీయం చేసిన పార్టీలు ఇక కులాల పోరాటాలు మొదలుపెట్టాయి. దొరలకు వ్యతికరేకంగా రెడ్డి సామాజికవర్గం ఏకమవుతుంది.

revanth reddy targets again cm kcr
revanth reddy targets again cm kcr

రేవంత్ రెడ్డి సారధ్యంలో కొందరు కీలక నేతలు ఏకమై, కేసీఆర్ ని దించే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అవసరమైతే మతం తప్ప,, కులం పెద్దగా పట్టించుకోని.. బీజేపీలో దూరి.. 2023 నాటికి తెలంగాణా పెత్తనం తీసుకోవాలని ఆలోచనలు మొదలయ్యాయట. కోమటిరెడ్డి.., రేవంత్ రెడ్డి, జానారెడ్డి వంటి నేతలు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ పార్టీ బలం సరిపోవడం లేదు. అందుకే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరూ బీజేపీలో చేరి.., ఒకరు దక్షిణ తెలంగాణ.., ఒకరు ఉత్తర తెలంగాణలో బలోపేతం కావాలనేది ప్రణాళిక. కానీ.. ఇక్కడ ఇప్పటికే పాతుకుపోయిన బీజేపీ పెద్దలు బండి సంజయ్, అరవింద్ లాంటి నేతల వెనుక నడవాల్సిందే. అందుకే కిషన్ రెడ్డి ద్వారా బీజేపీ పెద్దలతో ఈ లాబీయింగ్ గట్టిగా పని చేస్తుందని.., త్వరలోనే బీజేపీలో కూడా కుల ప్రస్తావన తెచ్చి.., తెలంగాణాలో కేసీఆర్ పై తిరుగుబావుటాకి సుదీర్ఘ ప్రణాళిక సిద్ధం చేస్తారనేది ఒక అంతర్గత ప్రచారం. సో.., ఏపీ తరహాలోనే తెలంగాణాలో కూడా ఇక “జై తెలంగాణ” నినాదాలు కాకుండా “జై కులం” నినాదాలు వినిపించనున్నాయన్నమాట..!!

 

 

 

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !