NewsOrbit
దైవం న్యూస్

ఆలయం లో హారతి గంట వెనుక రహస్యన్నీ తెలుసుకోండి!!

ఆలయం లో హారతి గంట వెనుక రహస్యన్నీ తెలుసుకోండి!!

దేవాలయాలకు వెళ్లినప్పుడు దేవుడికి ఎదురుగా కనిపించేది గంట. గుడి ఎంత చిన్నదైనా  గంట ఖచ్చితంగా ఉంటుంది. దేవుణ్ని స్మరించుకుంటూ.. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి దేవుడి దర్శననానికి వచ్చినప్పుడు  గంట కొట్టడం భక్తులకు అలవాటు . గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గంట కొడతారు. అలాగే గుళ్లో దేవుడికి హారతి ఇచ్చినప్పుడు కూడా గంట కొడతారు. అసలు గంట ఎందుకు కొడతారు ? అనే సందేహం చాలా మందికే ఉంటుంది..

ఆలయం లో హారతి గంట వెనుక రహస్యన్నీ తెలుసుకోండి!!
గంటలో ఉండే ప్రతి భాగానికి ఒక ప్రత్యేకత ఇమిడి ఉంది. గంట నాలుక లో సరస్వతీదేవి కొలువై ఉంటుందని, గంట ముఖభాగంలో బ్రహ్మదేవుడు, కడుపు భాగం లో రుద్రుడు, కొనభాగంలో వాసుకి, పిడి భాగం చక్ర, గరుడ, హనుమ, నంది మూర్తుల తో ఉంటుందని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఈ గంటను సకల దేవతల స్వరూపం గా భావించి ముందుగా గంటను కొడతారు. కర్పూర హారతి ఇచ్చేటప్పుడు గంటకొట్టడానికి ఈ కారణాలు చెబుతూ ఉంటారు.

ఆలయాల్లో కర్పూర హారతి ఇచ్చే  సమయంలో మనకి కలిగే అనుభూతి చెప్పలేనిది . ఆ వెలుగు లో గంటల శబ్ధం లో దేవదేవతలను దర్శించుకోవడంతో అణువణువు పులకిస్తుంది. అయితే.. ఆ సమయంలో గంట కొట్టడం వలన ఆ ఘంటా నాదం అసుర గుణాలను తరిమి కొడుతుందని నమ్మకం తో గంట మోగిస్తారు.
అంతే కాదు హారతి సమయంలో స్వామి వారి దివ్యదర్శనంలో భక్తు లకు దర్శనమిస్తారు. అపుడు వెలిగే జ్యోతి దివ్య జ్యోతి. మనలోని అసుర గుణాలను తరిమికొట్టి.. విగ్రహరూపంలోని దైవాన్ని దర్శించుకుంటూ భక్తులు అంతర్ముఖులు కావాలన్నదే ఆ సాంప్రదాయానికి అర్థం హారతి ఇస్తున్నప్పుడు దేవతలనందరినీ ఆహ్వానిస్తున్నామనీ చెప్పడానికి, గంట కొడుతున్న సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామనీ, ఆ దైవాంశ విగ్రహంలోకి చేరినపుపడు ఉన్న రూపాన్ని హారతి వెలుగులో ఆలయంలో చూపడం జరుగుతోందని తెలుపుతుంది ఈ హారతిగంట. అందువల్ల హారతి ఇచ్చే సమయంలో దేవుడిని ప్రత్యక్ష దైవాంశ చేరిన రూపంగా దర్శించాలని చెబుతున్నారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju