మెగా వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. బంధువుల రాకతో మెగా ఇల్లు హరివిల్లుగా మారిపోయింది. పెళ్లి వేడుకలను అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ మెగా ప్రిన్స్ కోసం మెగా ఫ్యామిలీ అంతా సందళ్లు మొదలు పెట్టారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలంతా తమ తమ షూటింగ్ లకు బ్రేక్ వేసారు. వీరంతా కలిసి ఈ ప్రిన్స్ పెళ్లి పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిహారికా పెళ్లే హాట్ టాపిక్ గా మారింది. ఎంతో ఘనంగా విలాసవంతంగా ఉండే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఉండే ఎంతో అత్యాధునికమైన ప్యాలెస్ లో ఈ పెళ్లి జరగనుంది.
కాబట్టి మెగా ఫ్యామిలీ పెళ్లికి సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరికి ఆహ్వానాలు లభించాయంటూ గుసగుసలు మొదలయ్యాయి. నీకు వచ్చిందా అంటే నీకు ఆహ్వానం వచ్చిందా అంటూ మాటలు మొదలయ్యాయి. అయితే కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో నిహారిక పెళ్లి సంబురం జరగనున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు సినీ ఇడస్ట్రీ నుంచి వీరికి ఆహ్వానం అందినట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. వారేవరో తెలుసా ప్రముఖ హీరోలైనా నందమూరి బాలయ్య బాబుకు, బాడీగార్డ్ విక్టరీ వెంకటేష్ కు, అక్కినేని నాగార్జునకు ఆహ్వానం అందినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
వీరికి తమ్ముడు నాగబాబు తరఫున మెగాస్టార్ శుభలేఖలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండే తన ఆప్త మిత్రుడు నందమూరి బాలయ్య కు మాత్రం చిరంజీవి స్వయంగా ఫోన్ చేసి పెళ్లికి రావాల్సిందిగా కోరారట. వీరితో పాటుగా హీరో వరుణ్ తేజ్ కూడా సినీ ఇండస్ట్రీలో తనకు ఆప్త మిత్రులైన రానా, నితిన్, అక్కినేని నాగచైతన్యలను ఫ్యామిలీతో తప్పకుండా హాజరు కావాలంటూ కబురు పంపారట. అలాగే కథానాయికల నుంచి పూజా హెగ్డేను, రష్మిక ను కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. వీరితో పాటుగా ఇండస్ట్రీ నుంచి ప్రముఖ దర్శకులైన రాజమౌళి, కోదండరామిరెడ్డి, కొరటాల శివ, రాఘవేంద్రరావు ఇంకా ప్రముఖులు రానున్నట్టు తెలుస్తోంది.
వీరే కాకుండా తెలుగు నిర్మాతలకు కూడా ఆహ్వానం పలికినట్టు సమాచారం. అనిల్ సుంకర, దానయ్య, దిల్ రాజు, సురేష్ బాబులకు నిహారికా శుభలేక వెళ్లినట్టు తెలుస్తోంది. వీరితో పాటుగా మరికొందరు సినీ ప్రముఖులకు పెళ్లి వెళ్లడానికి కార్డులు అందించబడ్డాయని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇంకేముంది సినీ ప్రముఖుల రాకతో నిహారిక పెళ్లి మరింత సంబురంగా జరగబోతోందని అర్థమవుతోంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!