NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

విమానయానంలో 368 ఉద్యోగాలు..! వివరాలివే..!!

 

సంవత్సరానికి లక్షల్లో వేతనం తీసుకోవాలని అందరికీ ఆశే..! మఖ్యంగా విమానయాన రంగం.. క్రేజీ కొలువు..! యువత ఆసక్తి అంతా ఇంతా కాదు..! పరీక్షలో ప్రతిభ చూపితే ఏకంగా సంవత్సరానికి రూ.12-18 లక్షలు వేతనం పొందవచ్చు. ఈ పరీక్షలో రుణాత్మక మార్కులు లేకపోవడం విషేశం..! భార‌త ప్ర‌భుత్వ పౌర ‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏ‌ఏ‌ఐ)లో మేనేజర్, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.. అర్హతలు , ఎంపిక విధానం, వేతన వివరాలు ఇలా..

 

AAI-recruitment-2020

విమానాశ్రయాల సమర్థ నిర్వహణకు ట్రాఫిక్‌ కంట్రోల్, ఆపరేషన్స్, టెక్నికల్‌ విభాగాల సేవలు ముఖ్యమైనవి. మేనేజర్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు కార్యాలయాల్లో ఉంటూ విమాన రాకపోకలు, ప్రయాణం సాఫీగా జరిగేలా విధులు నిర్వహిస్తుంటారు. మొత్తం 368 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సైన్స్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్‌ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు.ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రతిభ చూపినవారికి ఆ పోస్టు/ విభాగం బట్టి ఇంటర్వ్యూ/ ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎండ్యూరెన్స్‌ టెస్టు/ డ్రైవింగ్‌ టెస్టు/ వాయిస్‌ టెస్టు ఉంటాయి. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకం జరుగుతుంది. ఎంపికైతే మేనేజర్లకు రూ.60 వేలు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.40 వేలు మూలవేతనం ఇస్తారు. ఇంకా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. మొత్తం కలుపుకుని జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు రూ.12 లక్షలు, అదే మేనేజర్లయితే రూ.18 లక్షల వార్షిక వేతనం అందుకోవచ్చు.

మొత్తం ఖాళీలు : 368
మేనేజర్‌: ఫైర్‌ సర్వీసెస్‌ 11, టెక్నికల్‌ 2
అర్హత: మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌ విభాగంలో బీఈ/బీటెక్‌. అలాగే ఎగ్జిక్యూటివ్‌ స్థాయిలో సంబంధిత విభాగంలో అయిదేళ్ల పని అనుభవం ఉండాలి.
జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌: ఏర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ 264, ఏర్‌ పోర్టు ఆపరేషన్స్‌ 83, టెక్నికల్‌ 8 పోస్టులు ఉన్నాయి.
అర్హత: ఏర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ విభాగానికి మ్యాథ్స్, ఫిజిక్స్‌తో బీఎస్సీ లేదా బీఈ/బీటెక్‌. ఏర్‌ పోర్టు ఆపరేషన్స్‌కు సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌తోపాటు ఎంబీఏ, బీటెక్‌ చదివినవారై ఉండాలి. టెక్నికల్‌ ఖాళీలకు మెకానికల్‌ లేదా ఆటోమొబైల్‌లో బీఈ/బీటెక్‌ చదివుండాలి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ఎలాంటి పని అనుభవం అవసరం లేదు. అన్ని పోస్టులకు 60% మార్కులు ఉండాలి.
వయసు: మేనేజర్లకు 32 ఏళ్లు, జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లకు 27 ఏళ్లు ఉండాలి. దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, సడలింపు వర్తిస్తుంది.

 

online exam

ఎంపిక విధానం : 

అన్ని పోస్టులకు ముందుగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రుణాత్మక మార్కులు ఉండవు. ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం ఇంటర్వ్యూ, దేహదార్ఢ్య, డ్రైవింగ్, వాయిస్‌ టెస్టు ఉంటాయి. వీటిలోనూ అర్హత సాధించాలి. తుది నియామకాలు రాత పరీక్ష, సంబంధిత విభాగాల్లో చూపిన ప్రతిభ ద్వారా తీసుకుంటారు. ఈ పోస్టులకు ఎంపికైనవారు దేశంలో ఎక్కడైన విధులు నిర్వర్తించాలి. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఏటీసీ), మేనేజర్‌ (ఫైర్‌ సర్వీసెస్‌) పోస్టుల్లో చేరేవారు శిక్షణ తరవాత కనీసం మూడేళ్లపాటు కొనసాగడం తప్పనిసరి. ఇందుకోసం ఆ పోస్టును బట్టి రూ.7 లేదా రూ.5 లక్షల విలువైన ఒప్పంద పత్రంపై అంగీకారం తెలపాలి.

దరఖాస్తులు ప్రారంభతేది : 15/12/2020.
చివరి తేదీ : 14/1/2021.
ఫీజు : రూ.1000/-. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు రూ.170/-.
వెబ్‌సైట్‌: http://www.aai.aero/

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N