NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

ఏలురే కాదు…. మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (1 పార్ట్ )

 

ప్రచారాలు … ప్రయోగాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఏలూరు నిజాలని ప్రజానీకాన్ని ముప్పుతిప్పలు పెడుతూ మళ్ళీ ఆ ” పంపుల చెరువు ” నీళ్ళే తాగిస్తున్నాయి. ఏలూరు వింత వ్యాధి నీటి ద్వారానే వచ్చింది అని ఓ ప్రాధమిక నిర్ధారణతో అన్ని వైపులా నుంచి ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది…. అసలు నీరు వాళ్ళ ఇంతటి ప్రమాదం ఉందా? అసలు నీటిలోకి ఎలాంటి విష పదార్ధాలు వెళ్తాయి..? దాని ప్రభావం ఇలా ఉంటుంది అనేది ఎప్పుడు ఎంతో మంది కి ఆసక్తి కలిగించే అంశం…. నీరు.. దానిలోని కారకాలు ఎలా ఉంటాయో ఒకసారి మీకు చెప్పేందుకు  

” న్యూస్ ఆర్బిట్ ” చిన్న ప్రయత్నం..

ఏలురే కాదు మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (2 పార్ట్ )

Image credit: JEAN AURELIO PRUDENCE/L’Express Maurice/AFP via Getty Images

** తాగు నీటిలో భార లోహాలు కలిసినపుడు .. అవి నీటిలో కరిగి స్వచ్ఛమైన నీటి స్వభావాన్ని నాశనం చేసి దానిలోనే మిళితమై ఉంటాయి. వీటిని తాగిన, వేర్వేరు అవసరాలకు ఉపయోగించినా నాడీ వ్యవస్థకు సంబంధించి న అనూహ్య మార్పులు జరుగుతాయి.
** నీటిలో ఘన పదార్థం లేక ద్రవ పదార్థం చేరడం వల్ల నీటి నాణ్యత తగ్గి తాగడానికి సాధారణ వినియోగానికి వీల్లేకుండా పోవడాన్ని నీటి కాలుష్యం అనొచ్చు. నీటిలో అనవసర పదార్థాలు కలవడం వల్ల నీటి సహజ గుణం మారిపోయి నిరుపయోగంగా, మానవుడికి, ఇతర జీవులకు హాని కలిగించేలా మారడాన్ని నీటి కాలుష్యం అంటారు. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి వాసన ఉండవు. కానీ మానవుడికి అందుబాటులో ఉన్న ఒక శాతం నీటిలో అనేక పదార్థాలు కలిసి నీటి కాలుష్యాన్ని కలగజేస్తున్నాయి. సాధారణంగా భూమి ఉపరితలం పైన, భూగర్భంలో అనేక కారణాల వల్ల నీటి కాలుష్యం జరిగి అది తాగడానికి, సాగు చేయడానికి ఉపయోగపడటం లేదు.
 కలుషిత నీటి లక్షణాలు
1) తాగు నీరు రుచి చెడిపోవడం
2) సరస్సులు, చెరువులు, నదులు, సాగర తీరాల వద్ద ఘాటైన దుర్వాసన రావడం
3) నీటిలో కలుపు మొక్కలు అదుపు లేకుండా పెరగడం
4) జల చరాలు తగ్గిపోవడం/నశించడం
** నీటి కాలుష్యానికి కారణాలు

ఏలురే కాదు మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (2 పార్ట్ )


** గృహ సంబంధ మురుగు, వ్యర్థాలు:
గ్రామాల నుంచి నగరాల వరకు ఇళ్లల్లోని వివిధ అవసరాలకు వాడిన నీటిలో వ్యర్థాలు, మానవ విసర్జితాలు, కాగితాలు, దుస్తులు, సబ్బులు, డిటర్జెంట్లు మొదలైనవి కలిసి ఏర్పడినదాన్ని మురుగు అంటారు. శుద్ధి చేసిన/శుద్ధి చేయని మురుగు.. చెరువులు, సరస్సులు, నదులు తదితర జలాశయాల్లోకి చేరడం వల్ల నీరు కలుషితమవుతోంది.
** వ్యవసాయ వ్యర్థ పదార్థాలు:
వ్యవసాయంలో వాడే ఎరువులు, క్రిమి సంహారక మందులు, ఇతర రసాయనాలు జలాశయాల్లో చేరి ఉపరితల, భూగర్భ జలాలు తీవ్రంగా కాలుష్యానికి గురవుతున్నాయి. మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ కారణాల వల్లే నీరు కలుషితమవుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
**పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు:
ఔషధాలను తయారుచేసే పరిశ్రమలు, బట్టలు, కాగితపు మిల్లులు, రసాయనాలు, ఎరువులు, పురుగు మందులు, ప్లాస్టిక్, అద్దకపు రంగులు మొదలైనవాటిని తయారుచేసే పరిశ్రమలు, బొగ్గు గనులు, ఉక్కు కర్మాగారాలు, నూనె శుద్ధి కర్మాగారాలు, సిమెంట్‌ పరిశ్రమలు మొదలైన వాటి నుంచి వెలువడే పదార్థాల్లోని విష రసాయనాలు, జీవక్షయం పొందని కర్బన మూలక రసాయనాలు, తైల స్వభావం గల పదార్థాలు, రేడియో ధార్మిక పదార్థాలు జలాశయాల్లోకి చేరడం వల్ల నీరు కలుషితమై మానవులకు, ఇతర జీవరాశులకు పనికిరాకుండా పోతుంది. లవణ మలినాల వల్ల నీటి కాఠిన్యత వచ్చి అది తాగడానికే కాకుండా పారిశ్రామిక ప్రయోజనాలకూ ఉపయోగపడదు.

ఏలురే కాదు మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (2 పార్ట్ )


** థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు
థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి ఎక్కువగా బొగ్గును ఉపయోగిస్తున్నారు. ఈ శిలాజ ఇంధనం దహనం చెందినప్పుడు వెలువడిన బూడిద రేణువులు తొలుత వాతావరణంలోకి
తర్వాత జలాశయాల్లోకి చేరి కాలుష్యాన్ని ఎక్కువ చేస్తున్నాయి.
** అణు వ్యర్థ పదార్థాలు
ప్రపంచంలో అణు ఇంధనాలను ఉపయోగించే దేశాలు అణు వ్యర్థాలను సముద్ర గర్భంలో, భూగర్భంలో నిక్షిప్తం చేయడం వల్ల ఈ జలాలు కాలుష్యానికి గురవుతున్నాయి. ఇది దీర్ఘకాలంగా ఉండటమే కాకుండా మానవుడికి, జలచరాలకు ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది.


** ప్రకృతి విపత్తులు
భారీ వర్షాల వల్ల ఏర్పడే వరదల్లో కొట్టుకొచ్చిన వ్యర్థ పదార్థాలు జలాశయాల్లో కలవడం వల్ల నీరు తీవ్రంగా కాలుష్యానికి గురవుతోంది.
** చమురు (నూనె)
క్రూడ్‌ ఆయిల్‌ రవాణా నౌకలు సముద్రంలో మునిగినప్పుడు ఆ చమురు జలాశయాల్లో కలవడం వల్ల నీరు కలుషితమవుతోంది. చమురు.. నీటిపై తెట్టులాగా వ్యాపిస్తుంది. దీంతో అనేక సముద్ర జీవులు నశిస్తాయి.

(అసలు నీటిలో ఎలాంటి లోహాలు ఉంటాయి… వాటి వెనుక ఉన్న విషయం, విషం గురించి వచ్చే కథనంలో తెలుసుకుందాం)

ఏలురే కాదు మన చుట్టూనే వింత వ్యాధులున్నాయి జాగ్రత్త (2 పార్ట్ )

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N