ఉద్యోగం చేస్తున్నాం..నెలవారిగా ఆదాయం వస్తుంది దాంతో జీవితం సాఫీగా సాగుతుంది. ప్రతిరోజూ ఒకేలా ఉండదు. కాలం వయస్సును తరిగిస్తోంది. ప్రస్తుతం రోజూ వారి, నెలవారి అదాయాన్ని పొందుతున్నాము కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. రేపటి భవిష్యత్ కూడా ఇలానే సాఫిగా ఇప్పటినుంచే దాని గురించి ఆలోచించాలి. నెలవారిగా వచ్చే ఆదాయాన్ని వివిధ పధకాలలో పెట్టుబడులు పెడితే రేపటికి వృధ్దప్యా దశలో అది మనకు భరోసా ఉంటుంది.
1. ఫిక్స్డ్ డిపాజిట్లు
చాలా మందికి సురక్షితమైన పెట్టుబడులుగా ఫిక్స్డ్ డిపాజిట్లకే ప్రధాన్యం ఇస్తారు. ఎఫ్డీ పెట్టుబడులతో నెలవారిగా కాకుండా త్రైమాసికానికి ఒకసారిగా ఆదాయం లభిస్తుంది.ఈ పెట్టుబడి విధానంలో నెలవారిగా కూడా ఆదాయాన్ని పోందవచ్చు. నెలవారిగా ఆదాయం పొందాలనుకుంటే ఏడాది వరకు నెలకు కొంత కచ్చితమైన డబ్బును డిపాజిట్ చేయాలి. 12 నెలలకు డబ్బుగా పెట్టుబడి రూపంలో ఉంటుంది. దాని నుంచి ప్రతి నెల వడ్డీని పోందవచ్చు. అయితే ఈ ప్లాన్‌లో అనుకూలం కంటే ప్రతికూల అంశాలే ఎక్కువగా ఉన్నాయని. ఒకవేళ వడ్డీ రేట్లు తగ్గితే ఆదాయం తగ్గవచ్చు.
2. నెలవారిగా లంభించే అదాయ పధకాలు
నెలవారి ఆదాయ మార్గాలలో పోస్టాఫిస్ అందించే ఫథకాలు ఉత్తమైనవి. వీటి ద్వారా 7.3 శాతం వడ్డీ లభిస్తోంది. నెలకు ఒకసారి వడ్డీని అందిస్తారు. వీటిలో పెట్టబడి పెట్టడానికి గరిష్ట పరిమితి రూ 4.5లక్షలుగా ఉంటుంది. జాయింట్ అకౌంట్‌కు అయితే రూ.9 లక్షలు. ఉమ్మడి ఖాతాపై నెలకు రూ.5,300 వడ్డీ లభిస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్లు ఈ పధకాలను అందిస్తాయి కావున కొంత మార్కెట్ రిస్క్ ఉంటుంది. వీటిలో 10 ఏళ్ల మైనర్ పేరుతో కూడా ఖతాను ప్రారంభించవచ్చు.
3. సీనియర్ సిటిజన్ల పథకం
వృద్ధులు, వయో వృద్ధుల కోసం ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ ఫథకం మెచ్యూరిటీ ఐదేళ్ళు. అరవై వయస్సు ఉన్నవారు కూడా ఈ ఫథకాలను భాగ్యసాములు కావచ్చు. ఇందులో రూ.15 లక్షల వరకు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ పథకంపై 8.6 శాతం వడ్డీ లభిస్తోంది. సెక్షన్ 80సి కింద పన్ను సడలింపు ఉంటుంది.
4. మ్యూచువల్ ఫండ్స్ …
మ్యూచువల్ ఫండ్‌లో కూడా నెలవారి ఆదాయ మార్గాలు ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లలా వీటిపై ష్థిరమైన ఆదాయం ఉండదు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఈ పథకాలపైనా ప్రస్తుతం 8 నుంచి 9 శాతం వరకు రాబడి లభిస్తోంది. మ్యూచువల్ ఫండ్‌పై ఆదాయాన్ని సంస్ధలు డివిడెండ్ రూపంలో చేల్లిస్తాయి. ఈ డివిడెండ్ రాబడులపై ఎలాంటి పన్నుల భారం ఉండదు.
5. యాన్యుటీ పథకాలు..
బీమా పాలసీల యాన్యుటీ ఆప్షన్ ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు. ఈ ఫథకం ద్వారా రాబడులు అందేందుకు సమయం పడుతుంది. పెన్షన్ గడువు, పాలసీ తీసుకునేటపుడు ఏ ఆప్షన్‌ను ఎంచుకున్నారనే విషయాల ఆధారంగా యాన్యుటీ రాబడులు ఉంటాయి. రెగ్యులర్ ఆదాయం కోసం వేరే ఆప్షన్లు లేని ఇన్వెస్టర్లు మాత్రమే ఈ ఈ పథకాన్ని ఎంచుకోవాలి.