మనం ప్రతిరోజు ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతాం.. అంటే ఫోన్ లోనే అని 99% మంది చెప్తారు. అంతలా గడుపుతున్నాం మనం ఫోన్ లో మరి. లేచినప్పటి నుంచి పడుకునే వరకు చాల మంది ఫోన్ చూస్తూనే ఉంటారు. ఫోన్ చూస్తూనే పడుకుంటాం. ఫోన్ లేకపోతే మన శరీర అవయవాల్లో ఒక అవయవం మిస్ అయ్యిందనే వాళ్ళు కూడా ఉంటారు. స్మార్ట్ ఫోన్ లకి అంతలా అలవాటు పడిపోయాం. మార్కెట్ లో కొత్తగా ఏం ఫోన్ వచ్చిందని తెగ వెతికేస్తుంటారు. ఎక్కువ మంది వెతికిన ఫోన్ లు ఏంటి అని తెలుసుకోవాలని ఉందా.. అయితే చదివేయండి.
ప్రజలు వెతికిన టాప్ టెన్ లో ఉన్న ఫోన్లు ఇవే. మార్కెట్లోకి వచ్చే నెలలో విడుదలయ్యే శామ్ సంగ్ గెలాక్సీ ఎస్2ప్లస్ 5జీ మొబైల్ మొదటి స్థానంలో నిలిచింది. ఎప్పుడు మార్కెట్ లోకి వస్తుందా?? ఎప్పుడెప్పుడు కొనేద్దామా అని జనాలు తెగ వెతికేస్తున్నారు. రెండవ స్థానంలో ఒప్పో రెనో 5 ప్రో ప్లస్ 5జీ మొబైల్ ఉంది. గత వారంలో టాప్ 2 లో ఉన్న షియోమీ రెడ్ మీ నోట్ 9 ప్రో మూడవ స్థానంలో ఉండగా.. టాప్ 1 లో ఉన్న షియోమీ పోకో ఎమ్ 3, నాల్గవ స్థానంలోకి పడిపోయింది.
కొత్తగా రానున్న శామ్ సంగ్ గెలాక్సీ ఎ 52 5జీ మొబైల్ ఐదవ స్థానంలో ఉండగా శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 21 5జీ ఫోన్ ఆరవ స్థానంలో నిలిచింది. గత వారం మూడవ స్థానంలో ఉన్న ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఏడవ స్థానంలో ఉంది. గతవారం 5,4,7 స్థానాల్లో ఉన్న షియోమీ రెడ్ మీనోట్ 9, ఎనిమిదవ స్థానంలో ఉండగా, శామ్ సంగ్ గెలాక్సీ ఎ 51, షియోమీ ఎంఐ 10టీ ప్రో ఫోన్ లు 9, 10 స్థానాల్లో నిలిచాయి.