సరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్లే సమయంలో ఇంటి నుండి మోనాల్ ఎలిమినేట్ అవ్వటం బిగ్గ్ బాస్ ఆడియన్స్ని మాత్రమేకాక ఆమె అభిమానులను ఎంతగానో నిరాశపరిచింది. హౌస్ లో వచ్చిన ప్రారంభంలో కంటే చివరిలో మోనాల్ ఆడిన గేమ్ కి ఆమె ఓటింగ్ గ్రాఫ్… టాప్ కంటెస్టెంట్ లను తలదన్నే రీతిలో పెరిగిపోయింది.
మొదటిలో ఆమెపై నెగిటివిటీ ఉన్న చివరి దశకు వచ్చే సమయానికి.. హారిక కెప్టెన్ అయ్యే సమయంలో ఆ తర్వాత ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ మోనాల్ ఆడిన గేమ్ చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది. అయితే గత వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన మోనాల్ ప్రస్తుతం బయట ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిలో భాగంగా ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరో అవుతారని మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.. అంటూ ప్రశ్నించడం జరిగింది. యాంకర్ వేసిన ప్రశ్నకు మోనాల్ ప్రతిస్పందిస్తూ అఖిల్ లేదా సోహైల్ గెలిస్తే బాగుంటుందని తెలిపింది. కానీ బయట పరిస్థితి చూస్తే వేరే వ్యక్తి పేరు చాలా గట్టిగా వినబడుతుంది అని మోనాల్ తెలపగా యాంకర్ ఆ పేరు ఏంటో చెప్పండి అని అనగా…మోనాల్ ఏ మాత్రం చెప్పడానికే ఇష్టపడలేదు. అది మీకు కూడా తెలుసు అంటూ యాంకర్ కి ఎదురు ప్రశ్న వేసింది. మరి ఆ వ్యక్తి ఎవరై ఉంటారో.