- బిగ్ బాస్ షో చివరి దశకు వచ్చే సరికి ఇంటి సభ్యులు అంతా ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోవడం మొదలుపెట్టారు. మంగళవారం నాడు ఎపిసోడ్ లో సీనియర్ కంటెస్టెంట్స్ ను పంపించి… బిగ్ బాస్ ఉన్న ఐదుగురు జర్నీ వీడియో లను చూపించి… వారంతా ఎమోషనల్ అయ్యేలా చేశాడు.
అందులో అఖిల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ కు మీ గురించి అంతా తెలుసు మీరు ప్రతి పరిస్థితుల్లో ఎమోషన్ ను కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు అంటూ అఖిల్ పై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ వీడియో చూసిన అఖిల్ మోనాల్ తో గడిపిన మధుర క్షణాలు చూసి భావోద్వేగానికి గురయ్యారు. అభిజిత్ హారిక గొడవలు సోహెల్ మెహబూబ్ లతో కలిసి ఉన్న సీన్స్ అఖిల్ ను ఏడిపించాయి.
ఇక్కడ మేము బంక మట్టి లా వచ్చాము… మనుషుల్లా మారి వెళ్దామా లేదా మళ్లీ మట్టి ముద్దుల్లా కింద పడిపోమా అన్నది మా చేతుల్లోనే ఉంది. నా వరకు నేను 100% కష్టపడ్డాను. ప్రయత్నం అయితే చేయగలను కానీ ఓడిపోతే నా తప్పు కాదని అఖిల్ అన్నాడు. ఇంట్లో ప్రేమ దొరక్కపోతే అలుగుతాను కానీ బయట ఇంత ప్రేమ ఉంటే ఇంకా తాను ఇంట్లో ప్రేమ గురించి ఆలోచిస్తున్నాను అంటే ఎంత మూర్ఖుడు నీ నేను అని అఖిల్ చెప్పాడు. ఇక ప్రేక్షకులకు పాదాభివందనం చేశాడు. ఈ సందర్భంగా ఈసారి టైటిల్ విన్నర్ నేనే అంటూ అఖిల్ కాన్ఫరెన్స్ ప్రదర్శించాడు.