NewsOrbit
న్యూస్

ఏపి ప్రభుత్వ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్

 

ఏపి ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా  ఆదిత్యనాధ్ దాస్ నియమితులైయ్యారు.  ఈ మేరకు ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త సీఎస్‌ని నియమించింది. కాగా సీఎస్ నీలం సాహ్ని సేవలు కొనసాగించుకోవాలని భావించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆమెను ముఖ్య సలహాదారుగా నియమించుకున్నారు.

బీహార్‌కు చెందిన ఆదిత్యనాధ్ దాస్ 1987 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. ప్రఖ్యాత బెనారస్ హిందూ యూనివర్శిటీలో బీఎస్సీ హానర్స్ పూర్తి చేసిన ఆదిత్యనాధ్ దాస్ ఢిల్లీలోని జెఎన్‌యూలో ఇంటర్నేషనల్ స్టడీస్ చేశారు. గతంలో ఆయన విజయనగరం, విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్‌గా, కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్‌గా, వరంగల్లు కలెక్టర్‌గా మురికివాల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్, మున్సిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్, నీటి పారుదల శాఖ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గా బాధ్యతలు నిర్వహించారు.

ప్రస్తుత సీఎస్ బాధ్యతలకు సీనియారిటీలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రమణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జెఎస్‌వి ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ లు ఉన్నప్పటికీ వీరిలో కొందరు కేంద్ర సర్వీసులో ఉండటం, కొందరు సీఎస్‌గా వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడంతో పాటు సీఎం వైఎస్ జగన్..ఆదిత్యనాధ్‌ వైపు మొగ్గుచూపారని సమాచారం. అధిత్యనాధ్ దాస్ 2022 జూన్‌లో రిటైర్ కానున్నారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం నుండి ఆంధ్రకు వచ్చిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని మున్సిపల్ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపి సంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కే సునీత నియమితులయ్యారు.

Related posts

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?