NewsOrbit
రాజ‌కీయాలు

బయటకు వస్తున్న టీడీపీ నాటి పాపాలు..! బాబు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!!

chandrababu naidu gets headache with party leaders

‘నాది 40ఏళ్ల రాజకీయ జీవితం..’ అని గర్వంగా చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు.. అందుకు తగ్గట్టు వ్యవహరిస్తున్నారా..? అంటే ఆలోచించాల్సిందే. గతంలో అధికారం మాటున.. ‘తానే రాష్ట్రానికి అన్నీ.. రాష్ట్రం కోసమే తాను పుట్టాను.. టీడీపీ చేసిందంటే కరెక్టే.. నేను చేసేదే శాసనం.. నేను లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో..’ ఇలాంటి మాటలన్నీ ఎవరో చెప్పక్కర లేదు.. అధికారంలో లేని చంద్రబాబులో ఇవన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ‘మేము వేరు.. మా బ్లడ్ వేరు.. సస్టైనబిలిటీ మాకే ఉంది.. మాది దేవతల పార్టీ.. వైసీపీ రాక్షసుల పార్టీ’.. ఇవన్నీ ఆయన వియ్యంకుడు బాలకృష్ణ డైలాగులు. ఇవన్నీ సైటైరికల్ గా కాకుండా.. చెప్పాడం కాకుండా వాస్తవంగా ఆలోచిస్తే చంద్రబాబు ఆడే పొలిటికల్ స్లెడ్జింగ్ అని చెప్పాలి. ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న టీడీపీ నాయకుల గత ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కొత్త రకం స్లెడ్జింగ్ కు మొదలుపెట్టారు.

chandrababu naidu gets headache with party leaders
chandrababu naidu gets headache with party leaders

వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు గతంలో చేసిన దురాగతాలు.. కుంభకోణాలు.. భూకబ్జాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లాయి. ఇప్పటికే టీడీపీ బాగా డ్యామేజి అయి ఉంది. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజల మదిలో లేకుండా చేయాలనే ఉద్దేశమో.. లేక టీడీపీ నాయకులపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకో కానీ.. చంద్రబాబు తాపత్రయ పడుతున్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన, కర్నూలులో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం సమయంలో బయటకు రాని చంద్రబాబు ఇప్పుడు రామతీర్ధంకు మాత్రం బయటకు వచ్చి హడావిడి చేశారు. ప్రజల దృష్టి మరల్చే క్రమంలో.. గతంలో ప్రత్యేక తెలంగాణపై పార్టీ వైఖరి చెప్పలేక.. బాబ్లీ అంశం తెర మీదకు తెచ్చి మహరాష్ట్ర వెళ్లి పోలీసులు అరెస్టు చేస్తే హైలైట్ అయింది. ఆవిధంగా దృష్టి మళ్లించడంతో చంద్రబాబు నిజంగానే రాజనీతిజ్ఞులు. ప్రస్తుతం టీడీపీ ఆగడాలను దాచేందుకు అదే జరుగుతోంది.

  • అచ్చెన్నాయుడు.. ఈఎస్ఐ కుంభ‌కోణంలో రూ.150 కోట్ల అవకతవకలు జరిగాయనే ఆరోపణలు.. అరెస్టు.
  • కొల్లు ర‌వీంద్ర.. వైసీపీ నాయ‌కుడు మోకా భాస్కర్ రావు హ‌త్య కేసులో అరెస్టు.
  • జేసీ ప్రభాక‌ర్ రెడ్డి.. తాడిప‌త్రి ఎస్సై సంత‌కం ఫోర్జరీ చేసి బెంగ‌ళూరులో ఆరు లారీలు అక్రమంగా అమ్మారనే కేసు.
  • య‌ర‌ప‌తినేని శ్రీనివాసరావు.. 500 కోట్ల సున్నపురాయిని అక్రమంగా త‌వ్విన కేసులో సీబీఐ విచార‌ణ‌.
  • భరత్ చౌదరి.. లోకేశ్ తోడల్లుడు విశాఖ‌లో రూ.100 కోట్ల విలువైన భూమి క‌బ్జా చేసారనే గీతం స్థలంలో ఆక్రమణలు కూల్చివేశారు.
  • హ‌ర్షవ‌ర్దన్ చౌద‌రి.. విశాఖ‌లో 250 కోట్లు విలువైన భూముల‌ను క‌బ్జా చేసారనే ఆరోపణలు
  • గంటా శ్రీ‌నివాసరావు.. బంధువుల పేరుతో విశాఖ‌లో వంద‌ల ఎక‌రాల భూముల‌ క‌బ్జా చేసారని స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌ బయటపెట్టింది.
  • స‌బ్బం హ‌రి.. సొంత ఇంటి వద్దే భూ క‌బ్జాలు.. ఆక్రమణలు కూల్చివేసిన అధికారులు
  • ఎమ్మెల్యే వెల‌గ‌పూడి రామ‌కృష్ణ చౌద‌రి.. విశాఖ రుషికొండ స‌మీపంలో భూ ఆక్రమ‌ణ‌లు.
  • రాయ‌పాటి సాంబశివరావు.. బ్యాంకుల‌కు రూ.8 వేల కోట్లు ఎగనామం. పోల‌వ‌రం నిర్మాణంలో టీవీఎస్ 50 త‌దిత‌ర వాహ‌నాల‌పై ట‌న్నుల కొద్దీ ఇనుము త‌ర‌లించారనే ఆరోపణలు. దొంగ‌లు లెక్కలతో వేల కోట్లు దోచుకున్నారనే ఆరోపణలు.
  • ఓటుకు నోటు కేసు.. చంద్రబాబు, లోకేశ్‌ తనను ప్రోత్సహించారని ఈడీ ఎదుట వాగ్మూలం ఇచ్చిన టీడీపీ నాయ‌కుడు మ‌త్తయ్య..
  • అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్.. చంద్రబాబు బినామీలు అమ‌రావ‌తిలో 4వేల ఎక‌రాల భూములు కొనుగోలు చేసారని మంత్రివ‌ర్గ ఉప‌సంఘం బ‌హిర్గతం చేసింది.
  • చింత‌కాయ‌ల అయ్యన్నపాత్రుడు.. మ‌హిళా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను ‘బ‌ట్టలు ఊడ‌దీయాల్సి ఉంటుంది` అని భ‌య‌పెట్టడం..
  • కూన ర‌వికుమార్‌.. ‘చెట్టుకు క‌ట్టేసి కొడ‌తా.. గ‌దిలో బంధిస్తా` అని ప్రభుత్వ అధికారుల‌ను బెదిరించడం..
  • భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి.. హైదరాబాద్‌లో భూవివాదానికి సంబంధించి ముగ్గురిని కిడ్నాప్ చేసిన ఘటనలో అరెస్టు..

ఇవన్నీ.. టీడీపీకి జరిగిన.. జరుగుతున్న భారీ డ్యామేజిలు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ అనుభవాన్ని, ఎల్లో మీడియా ప్రతాపాన్ని చూపిస్తున్నాయని చెప్పకనే అర్ధమయ్యే విషయాలు. రాష్ట్రంలో దేవుడి విగ్రహాల ధ్వంసం చేసే టీడీపీనే ఇంతపెద్ద కుట్రకు తెర తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. పైన పేర్కొన్న అంశాల్లో కొన్నింటిని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ నిరూపించలేక పోయింది. అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ స్కాం, కొల్లు రవీంద్రపై హత్య కేసు, రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్.. వంటి అంశాలు ఇంకా నిర్దారణ కాలేదు. వైసీపీ ప్రభుత్వం టీడీపీపై ఎంత వేగంగా ఆరోపణలు చేసిందో ఇవి నిర్ధారణ కాకపోవడంతో అంతే గప్ చుప్ గా కూడా ఉంది. ఈ తరహా దూకుడును కూడా ఆధారాలుంటేనే ముందుకెళ్లడం ప్రభుత్వం విధి.

 

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju