chandrababu naidu gets headache with party leaders
‘నాది 40ఏళ్ల రాజకీయ జీవితం..’ అని గర్వంగా చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు.. అందుకు తగ్గట్టు వ్యవహరిస్తున్నారా..? అంటే ఆలోచించాల్సిందే. గతంలో అధికారం మాటున.. ‘తానే రాష్ట్రానికి అన్నీ.. రాష్ట్రం కోసమే తాను పుట్టాను.. టీడీపీ చేసిందంటే కరెక్టే.. నేను చేసేదే శాసనం.. నేను లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో..’ ఇలాంటి మాటలన్నీ ఎవరో చెప్పక్కర లేదు.. అధికారంలో లేని చంద్రబాబులో ఇవన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ‘మేము వేరు.. మా బ్లడ్ వేరు.. సస్టైనబిలిటీ మాకే ఉంది.. మాది దేవతల పార్టీ.. వైసీపీ రాక్షసుల పార్టీ’.. ఇవన్నీ ఆయన వియ్యంకుడు బాలకృష్ణ డైలాగులు. ఇవన్నీ సైటైరికల్ గా కాకుండా.. చెప్పాడం కాకుండా వాస్తవంగా ఆలోచిస్తే చంద్రబాబు ఆడే పొలిటికల్ స్లెడ్జింగ్ అని చెప్పాలి. ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న టీడీపీ నాయకుల గత ఆగడాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కొత్త రకం స్లెడ్జింగ్ కు మొదలుపెట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు గతంలో చేసిన దురాగతాలు.. కుంభకోణాలు.. భూకబ్జాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లాయి. ఇప్పటికే టీడీపీ బాగా డ్యామేజి అయి ఉంది. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్ని ప్రజల మదిలో లేకుండా చేయాలనే ఉద్దేశమో.. లేక టీడీపీ నాయకులపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకో కానీ.. చంద్రబాబు తాపత్రయ పడుతున్నారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన, కర్నూలులో ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం సమయంలో బయటకు రాని చంద్రబాబు ఇప్పుడు రామతీర్ధంకు మాత్రం బయటకు వచ్చి హడావిడి చేశారు. ప్రజల దృష్టి మరల్చే క్రమంలో.. గతంలో ప్రత్యేక తెలంగాణపై పార్టీ వైఖరి చెప్పలేక.. బాబ్లీ అంశం తెర మీదకు తెచ్చి మహరాష్ట్ర వెళ్లి పోలీసులు అరెస్టు చేస్తే హైలైట్ అయింది. ఆవిధంగా దృష్టి మళ్లించడంతో చంద్రబాబు నిజంగానే రాజనీతిజ్ఞులు. ప్రస్తుతం టీడీపీ ఆగడాలను దాచేందుకు అదే జరుగుతోంది.
ఇవన్నీ.. టీడీపీకి జరిగిన.. జరుగుతున్న భారీ డ్యామేజిలు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు తన 40ఏళ్ల రాజకీయ అనుభవాన్ని, ఎల్లో మీడియా ప్రతాపాన్ని చూపిస్తున్నాయని చెప్పకనే అర్ధమయ్యే విషయాలు. రాష్ట్రంలో దేవుడి విగ్రహాల ధ్వంసం చేసే టీడీపీనే ఇంతపెద్ద కుట్రకు తెర తీసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. పైన పేర్కొన్న అంశాల్లో కొన్నింటిని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికీ నిరూపించలేక పోయింది. అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ స్కాం, కొల్లు రవీంద్రపై హత్య కేసు, రాజధాని భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్.. వంటి అంశాలు ఇంకా నిర్దారణ కాలేదు. వైసీపీ ప్రభుత్వం టీడీపీపై ఎంత వేగంగా ఆరోపణలు చేసిందో ఇవి నిర్ధారణ కాకపోవడంతో అంతే గప్ చుప్ గా కూడా ఉంది. ఈ తరహా దూకుడును కూడా ఆధారాలుంటేనే ముందుకెళ్లడం ప్రభుత్వం విధి.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…