NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో ఆలయాల పునః నిర్మాణానికి నేడు సీఎం జగన్ శంకుస్థాపన

 

ఏపిలో రామతీర్ధంతో సహా పలు ప్రాంతాల్లో దేవాలయాలపై జరిగిన దాడులను పురస్కరించుకుని బీజేపీ, హింధూ సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తున్న వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేసిన పలు ఆలయాల పునరుద్దరణకు చర్యలు చేపట్టింది జగన్ సర్కార్. ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం, ఆలయాలపై దాడుల వెనుక రాజకీయ కుట్ర ఉందనీ, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసి లబ్దిపొందాలన్న దురుద్దేశాలు ఉన్నాయనీ ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. జరిగిన ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ రామతీర్థం సహా పలు ఘటనల దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. ఇదిలా ఉండగా విజయవాడలో ఆలయాల పునః నిర్మాణం, దుర్గ గుడిలో అభివృద్ధి, విస్తరణ పనులకు ప్రభుత్వం 77 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు (శుక్రవారం 11.01 గంటలకు) ఆలయాల పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దక్షిణ ముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహుకేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్ణుడి ఆలయం, కృష్ణానది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునః నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. అదే విధంగా ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు.

పునః నిర్మాణం చేపట్టే ఆలయాలు

రూ.70 లక్షలతో రాహుకేతు ఆలయ పునః నిర్మాణం, రూ.9.5 లక్షలతో సీతమ్మ పాదాలు ఆలయ పునః నిర్మాణం, రూ.31.5 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయం, రూ.2 కోట్లతో రాతితో శ్రీ శనీశ్వర ఆలయ పునః నిర్మాణం, రూ.8 లక్షలతో బొడ్డుబొమ్మ ఆలయ పునః నిర్మాణం, రూ.20 లక్షలతో దుర్గుగుడి మెట్ల వద్ద శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునః నిర్మాణం, రూ.10 లక్షలతో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీదాసాంజనేయ ఆలయ పునః నిర్మాణం, రూ.10 లక్షలతో పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో వీరబాబు ఆలయ పునః నిర్మాణం, రూ.20 లక్షలతో కనకదుర్గ నగర్ లో శ్రీవేణుగోపాల కృష్ణ మందిరం, గోశాల పునః నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

అదే విధంగా దుర్గగుడిలో రూ.8.5కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం, రూ.5.6 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం, రూ.2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ, రూ.23.6 కోట్లతో కేశఖండన శాఖ భవన నిర్మాణం, రూ.19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం, రూ.5.25 కోట్లతో కనకదుర్గ టోల్ ప్లాజా నిర్మాణం, రూ.6.5 కోట్లతో ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు, కొండ చరియలు విరిగి పడకుండా మరమ్మత్తులు, పటిష్ట చర్యలు, రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ పనులు చేయనున్నారు.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?