NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

ఏస్ఈసీతో ప్రభుత్వ ప్రతినిధులు భేటీ..!!

 

ఏపి andhra pradeshలో స్థానిక సంస్థల ఎన్నికల local body elections నిర్వహణపై అభ్యంతరాలను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందం శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏస్ఈసీ) sec నిమ్మగడ్డ రమేష్ కుమార్ nimmagadda ramesh kumar‌తో బేటీ అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ adityanath das, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, అనిల్ కుమార్ సింఘాల్ లు ఏస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో సమావేశమైయ్యారు.

పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని కమిషన్ ప్రోసీడింగ్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నందున ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం..ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకోవాల్సిందిగా ఆదేశించింది. ముగ్గురు సీనియర్ అధికారులను ఎస్ఈసీ వద్దకు ప్రభుత్వం పంపాలనీ, రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లాలనీ హైకోర్టు సూచించారు.  కరోనా వ్యాక్సినేషన్ తదితర విషయాలపై పరిశీలన జరిపి ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందనీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలనీ హైకోర్టు ధర్మాసనం ఆదేశించి. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను క్లోజ్ చేసింది. హైకోర్టు ఆదేశాల పై ప్రభుత్వం తరపున సీఎస్ ఆదిత్యనాధ్ దాస్, ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, అనిల్ కుమార్ సింగ్‌లు ఎస్ఈసీతో భేటీ అయ్యారు.

కేంద్ర ప్రభుత్వం రెండు కరోనా వ్యాక్సిన్‌ల వినియోగానికి అత్యవసర అనమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యాక్సినేషన్ ‌కు సంబంధించి దేశ వ్యాప్తంగా డ్రైరన్ కూడా రెండు సార్లు నిర్వహించారు. మరి కొద్ది రోజుల్లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి వ్యాక్సినేషన్ పై ఇంకా షెడ్యూల్ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధుల బందంతో భేటీ అనంతరం ఎస్ఈసీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju