NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఏం కంగారు లేదు..! ప్రభుత్వం దగ్గర చాలా దారులున్నాయ్..! నిమ్మగడ్డకి చుక్కలే..!?

ap government upper hand on nimmagadda

* స్థానిక ఎన్నికలు జరుగుతాయా..? లేదా..!?
* ప్రభుత్వం దగ్గర పెద్ద ఆయుధం ఇదే..!!

ఇళ్లు అలాకాగానే పండగ కాదు. చుట్టాలు వచ్చిన వెంటనే పెళ్లి కాదు. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికలు జరిగినట్టు కాదు. సో.., నిమ్మగడ్డ Nimmagadda Ramesh Kumar రిటైర్ అయ్యేలోగా ఒక పెద్ద పరీక్ష రాస్తున్నారు. పాస్ అయితే తన మాట నెగ్గించుకుని.., ప్రశాంతంగా విశ్రాంత జీవితం గడుపుతారు. లేదా… రాజకీయాల్లో దూరుతారేమో..! ఒకవేళ ఆయన మాట నెగ్గకపోతే.. కెరీర్ చివరి దశలో అనవసరంగా గోక్కున్నానే.., తలవంపులు వచ్చేసాయి అనుకుంటూ కొన్నాళ్ళు బాధ పడతారు. సో.., ఇప్పుడు ఏపీలో Andhra Pradesh  స్థానిక ఎన్నికలు నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించేశారు. ప్రభుత్వం ఎంత వద్దు, వద్దు అంటున్నా… నిమ్మగడ్డ మాత్రం ఆగలేదు. “అమెరికాలోనే కరోనా పీక్స్ లో ఉన్నప్పుడు ఎన్నికలు ఆపలేదు. కరోనా ఏమి లేదు, ఏమి చేయదు. ఎన్నికలు జరుగుతాయి” అంటూ షెడ్యూల్ ఇచ్చారు. ఇప్పుడు ఇక ప్రభుత్వం ఏం చేయనుంది అనేదే కీలక అంశంగా మారింది..!!

cm jagan vs sec nimmagadda ramesh kumar election fight in climax
cm jagan vs sec nimmagadda ramesh kumar election fight in climax

వెంటనే కార్యదర్శి నుండి రిప్లై లేఖ..!!

ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యూలు ప్రకటించిన గంట వ్యవధిలోనే పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి పేరిట, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరిట నిమ్మగడ్డకి లేఖలు వెళ్లాయి. దీనిలో చాలా స్పష్టంగా ప్రభుత్వ ఉద్దేశం పేర్కొన్నారు. కరోనా టీకా పంపిణీలో యంత్రాంగం నిమగ్నం అయి ఉంది కాబట్టి స్థానిక ఎన్నికలు కుదరవు.., కరోనా రెండో దశ ఉంది కాబట్టి స్థానిక ఎన్నికలు కుదరవు. టీకా అందరికీ వేసిన తర్వాత.., రెండో దశ తగ్గిన తర్వాత ఎన్నికలు సంగతి చూద్దాం అన్నా మీరు వినకుండా ఏకపక్షంగా షెడ్యూలు ఇవ్వడం సబబు కాదు అంటూ లేఖలో పేర్కొన్నారు. నిమ్మగడ్డ షెడ్యూలు, ప్రభుత్వ లేఖలు చుసిన తర్వాత ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? ప్రభుత్వం దగ్గర ఉన్న అస్త్రాలు ఏమిటి అనేది చూద్దాం..!!

సర్కారు సింపుల్ బాటలో అడ్డుకోగలదు..! కానీ..!!

ఎన్నికలు నిర్వహణ అంటే నిమ్మగడ్డ, ఎన్నికల కమీషన్ ఒక్కరి వలన కాదు. కలెక్టర్లు, పోలీసులు, వేలాది సిబ్బంది సహకరించాలి. ఎన్నికల కమీషన్ కి సరెండెర్ అవ్వాలి. అలా జరిగి, నిమ్మగడ్డ చెప్పింది వింటేనే… చాల పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తేనే ఎన్నికలు సజావుగా సాగుతాయి. సో.. ఇక్కడే ప్రభుత్వానికి అస్త్రం ఉన్నట్టు.

* అధికారులు, సిబ్బంది ఎలాగూ ప్రభుత్వం, సీఎం చెప్పిందే వింటారు కాబట్టి..! సింపుల్ ఆయుధం తీసే అవకాశాలు ఉన్నాయ్. “సహాయ నిరాకరణ”..! కరోనా టీకా పంపిణీకి అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆల్రెడీ వివిధ ప్రణాళికల్లో ఉన్నారు. గ్రామా స్థాయిలో సచివాలయ సిబ్బంది కూడా గత వారం రోజుల నుండి ఇదే విధుల్లో ఉన్నారు. సో.., ఇప్పుడు మేము ఆ విధుల్లో ఉన్నాం స్థానిక ఎన్నికలు కుదరదు అంటూ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తరపున ఒక నివేదిక (ఒక పిటిషన్, ఒక అర్జీ) ఎలా అయినా నిమ్మగడ్డకి ఇస్తారు. యథాతథంగానే ఆయన ఒప్పుకోరు. మీరు ఎన్నికల కమీషన్ పరిధిలో ఉండాలి, మేము చెప్పించి చేయాల్సిందే అంటారు(అనుకుందాం)…! అప్పుడు అధికారులు అందరూ యధాలాపరంగానే “మేము చేయలేము మీరు చేసింది చేసుకోండి అంటారు…”? (అనుకుందాం)..! ఆయన మాత్రం నో.., కాదు, మీరు ఎన్నికల విధులు చేయాల్సిందే అంటారు. ఇక ప్రభుత్వం కల్పించుకుని.. ప్రధాన కార్యదర్శి సింపుల్ గా నిమ్మగడ్డకి ఒక లేఖ రాస్తారు. “కరోనా కారణంగా మేము టీకా పంపిణీలో ఉన్నాం, మా అధికారులు, సిబ్బంది బిజీగా ఉంటున్నారు. మీరు కూడా ఒక భారతీయ పౌరుడిగా.., ఒక పెద్ద టీకా ఉత్సవానికి సహకరించగలరు” అంటూ మెలికలు ఉన్న లెటర్ మరోటి రాస్తారు.. (అనుకుందాం)..! సో.., ఇక ఫైనల్ గా నిమ్మగడ్డ చేసేదేమి లేదు. మళ్ళీ కోర్టుకు, గవర్నర్ దగ్గరకు వెళ్లి “ప్రభుత్వం సహకరించడం లేదు. మీరు ఆదేశాలు ఇవ్వండి” అంటూ అడగాలి. లేదా నేరుగా ప్రభుత్వం సుప్రీమ్ లో పిటిషన్ వేసినా వేయొచ్చు..! ఇల్లా ప్రభుత్వం దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయి. అంచేత షెడ్యూల్ వచ్చేసినంత మాత్రాన ఎన్నికలు జరిగినట్టు కాదు. నిమ్మగడ్డ రిటైర్ అయ్యేలోగా ఆయనకు ప్రభుత్వం సినిమా చూపిస్తుందో.., ప్రభుత్వానికి ఆయన సినిమా చూపిస్తారో..! కీలక అంశంగా మారింది..! మనమూ చూద్దాం..! (ఈ అంశంపై “న్యూస్ ఆర్బిట్” ఎప్పటికప్పుడు తాజా విశ్లేషణలు అందిస్తుంది)

 

 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella