మన టాలీవుడ్ లోకి ఎంతోమంది కొత్త హీరో హీరోయిన్లు వచ్చి తమ నటనతో పాటుగా తమ అదృష్టాన్ని కూడా పరీక్షించుకుంటూ ఉంటారు. ఇలా కొంతమంది కేవలం నటన మరియు తమ అందంతోనే కాకుండా, వేరు వేరు సినిమాలలో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ముందు హీరోయిన్ గా మెప్పించి ఆ తరువాత విలన్ పాత్రల వైపు మొగ్గు చూపుతుంటారు. వీరు విలన్ గా వేసే ముద్రను ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోరు. పాయల్ రాజపుట్ కూడా ఈ కోవకు చెందిన హీరోయినే. పాయల్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్ట తొలి సినిమాతోనే విలన్ గా టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన పెర్ఫార్మన్స్ తో తెలుగు ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది పాయల్ రాజపుట్- Payal Rajput.
పాయల్ కు తన చిన్నప్పటి నుంచే నటన పై ఎక్కువ ఆసక్తి ఉండేదట. ఆమెకు నటన మీద ఉన్న ఆసక్తి చేత ఆమె హిందీ టెలివిజన్ ధారావాహికతో పాటు పంజాబీ, తెలుగు సినిమాలలో కూడా నటించింది. 2017 సంవత్సరంలో పంజాబీ సినిమా “చన్నా మెరెయా” తో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2018 లో తెలుగు లో హీరో కార్తికేయ సరసన “ఆర్ఎక్స్ 100 “- RX 100 సినిమాలో నటించి తనదైన శైలిలో ప్రేక్షకుల మన్నన పొందారు.
తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతున్నాయి. ఒక వ్యక్తి తో పాయల్ రాజ్ పుత్ గత కొద్ది రోజుల నుండి ప్రేమలో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా వార్తలు వినిపించాయి. ఈ విషయం పాయల్ స్వయంగా తన సోషల్ మీడియాలో తన లవర్ పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెబుతూ తెలియజేసింది. వీరిద్దరి ప్రేమకు పెద్దల నుండి అంగీకారం లభించడంతో పాయల్ మరియు సౌరబ్ డింగ్రా- Saurabh Dhingra త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు.