మన వంటలక్క, ప్రేమి విశ్వనాథ్ స్టార్ మా ఛానల్ లోని కార్తీకదీపం సీరియల్‌తో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకుని ఒక సంచలన నటిగా మారింది. ప్రేమి విశ్వనాథ్ తన అద్భుత నటనతో బుల్లితెర సీరియల్ ల జాబితాలో కార్తీకదీపం సీరియల్ ను ఇండియాలోనే నెంబర్ 1 రేటింగ్‌లో నిలబెడుతోంది.
ఇక ప్రేమి విశ్వనాధ్ ఈ సీరియల్ తో రెండు తెలుగు రాష్ట్రాలలోను విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, ప్రేమి విశ్వనాథ్ కి ఊహించని షాక్ తగిలింది. రాఫెల్ రామిరెజ్ అనే హ్యాకర్ ఆమె ఫేస్ బుక్ అకౌంట్ ను హ్యాక్ చేశాడు. వంటలక్క అకౌంట్ ద్వారా పిచ్చి పిచ్చి వీడియోలను, ఫొటోలను షేర్ చేసాడు. ఇదంతా చుసిన వంటలక్క వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించింది.
ఇటీవల ఎవరో తన ఫేస్ బుక్ అకౌంట్ ని హ్యాక్ చేసి పిచ్చి పిచ్చి వీడియోలను మరియు ఫోటోలను పెడుతున్నారని ఇది గమనించిన తనకి ఈ విషయం గురించి ఎవరికి, ఎక్కడ కంప్లైంట్ చెయ్యాలో తెలియక కాస్త ఆలస్యమైందని, అలాగే వరుస షూటింగ్ ల వల్ల బిజీగా ఉండడంతో వెంటనే కంప్లైంట్ చెయ్యడం కుదర లేదని చెప్పింది ప్రేమి. తనకు జరిగింది ఇంకొకరికి జరిగినప్పుడు, తనలాగే ఎవరికైనా ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు మీ అకౌంట్ హ్యాక్ అయినప్పుడు భయపడకుండా ఉండి అలంటి సమయంలో ఏం చేయాలో తెలియజేస్తూ సైబర్ క్రైమ్ పోలీస్ ద్వారా అవైర్నెస్ కల్పిస్తూ ఒక వీడియో విడుదల చేసింది ప్రేమి విశ్వనాథ్.